సెలవుల్లో తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? తిరుపతి టూర్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) హైదరాబాద్ నుంచి తిరుపతికి టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఒక రాత్రి, రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఫ్లైట్‌లో తిరుపతి తీసుకెళ్తోంది. తిరుమల శ్రీవారి దర్శనం ఏర్పాట్లు కూడా ఐఆర్‌సీటీసీ చూసుకుంటుంది. శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కూడా ఈ ప్యాకేజీలోనే కలిపి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుపతి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూర్, తిరుమల ప్రాంతాలు కవర్ అవుతాయి. 2021 అక్టోబర్ 22, అక్టోబర్ 29 తేదీల్లో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
EPF Rule: రూ.7 లక్షల ఉచిత ఇన్స్యూరెన్స్ కావాలంటే వెంటనే ఈ పనిచేయండి
Day 1: మొదటి రోజు ఉదయం 9.50 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 11 గంటలకు తిరుపతి చేరుకుంటారు. అక్కడ ఐఆర్‌సీటీసీ సిబ్బంది పర్యాటకులను రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్ లేదా అలాంటి హోటల్‌లో బస ఏర్పాట్లు ఉంటాయి. హోటల్‌కు చేరుకున్న తర్వాత ఫ్రెషప్ కావాలి. అక్కడే లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం తీసుకెళ్తారు. సాయంత్రం తిరిగి హోటల్‌కు చేరుకున్న తర్వాత విశ్రాంతి తీసుకోవాలి.
Day 2: రెండో రోజు ఉదయం తిరుమలకు తీసుకెళ్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవచ్చు. దర్శనం తర్వాత మధ్యాహ్నం తిరుచానూర్ తీసుకెళ్తారు. ఆ తర్వాత తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో పర్యాటకుల్ని డ్రాప్ చేస్తారు. తిరుపతిలో రాత్రి 8 గంటలకు ఫ్లైట్ ఎక్కితే రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
Aadhaar Card: మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి? సింపుల్‌గా చెక్ చేయండి ఇలా
ఐఆర్‌సీటీసీ తిరుపతి టూర్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.10,710 కాగా, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.10,805. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.12,490 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో అయితే రూ.9,895 చెల్లించాలి. 2 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్ లేకుండా రూ.9,650 చెల్లించాలి.
ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్ టికెట్లు, ఒక రాత్రి తిరుపతిలో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కవర్ అవుతాయి. ఒకవేళ ఫ్లైట్ ఛార్జీలు పెరిగితే వాటిని పర్యాటకులే భరించాల్సి ఉంటుంది.
ఆసక్తి గల పర్యాటకులు ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవాలి. ఇదే వెబ్‌సైట్‌లో టూర్ ప్యాకేజీ వివరాలు ఉంటాయి. ప్యాకేజీ బుక్ చేసేముందు పర్యాటకులు నియమనిబంధనలు పూర్తిగా చదివి తెలుసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Best tourist places, IRCTC, IRCTC Tourism, Tirumala, Tirumala news, Tirupati, Tourism, Tourist place, Travel