IRCTC TOURISM OPERATING VARIOUS TOUR PACKAGES FROM TIRUPATI TO SHIRDI OOTY KARNATAKA AND OTHER PLACES SS
IRCTC Tours: సమ్మర్ ట్రిప్ వెళ్తారా? తిరుపతి నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీలు ఇవే
IRCTC Tours: సమ్మర్ ట్రిప్ వెళ్తారా? తిరుపతి నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
IRCTC Tourism | ఐఆర్సీటీసీ టూరిజం తిరుపతి లోకల్ టూర్ ప్యాకేజీలతో పాటు తిరుపతి నుంచి వేర్వేరు ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను (Tour Packages) అందిస్తోంది. షిరిడీ, కర్నాటక, ఊటీ లాంటి ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ ప్యాకేజీలు బుక్ చేయొచ్చు.
సెలవులు వచ్చాయంటే తిరుపతికి టూర్ వెళ్లేవారు ఉంటారు. మరి తిరుపతిలో ఉన్నవారు ఎక్కడికి వెళ్తుంటారు? వారి కోసం ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) పలు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. లోకల్ టూర్ ప్యాకేజీలతో పాటు దేశంలోని ఇతర పర్యాటక ప్రాంతాలకు (Tourist Places) పలు టూర్ ప్యాకేజీలు అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలు రూ.990 నుంచి ప్రారంభం అవుతాయి. షిరిడీ, ఊటీ, కర్నాటకకు టూర్ ప్యాకేజీలు ఉన్నాయి. మరి ఏ టూర్ ప్యాకేజీ బుక్ చేస్తే ఏఏ ప్రంతాలు చూడొచ్చు? ప్యాకేజీ ధర ఎంత? తెలుసుకోండి.
IRCTC Divine Balaji Darshan: ఐఆర్సీటీసీ డివైన్ బాలాజీ దర్శన్ పేరుతో ఒక రోజు టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్ ఆలయం కవర్ అవుతుంది. ఈ ప్యాకేజీ ధర రూ.990. నాన్ ఏసీ వాహనంలో ప్రయాణం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. తిరుపతికి వచ్చే భక్తులు కూడా ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.
IRCTC Sai Sannidhi: ఐఆర్సీటీసీ సాయి సన్నిధి పేరుతో 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీలో షిరిడీతో పాటు శని శింగ్నాపూర్ కవర్ అవుతుంది. ఈ ప్యాకేజీ ధర రూ.3870. ప్యాకేజీలో రైలు టికెట్లు, వాహనంలో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
IRCTC Tirupati Moksham: ఐఆర్సీటీసీ తిరుపతి మోక్షం పేరుతో 1 రాత్రి, 2 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్ ఆలయం కవర్ అవుతుంది. ఈ ప్యాకేజీ ధర రూ.4,770. నాన్ ఏసీ వాహనంలో ప్రయాణం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. తిరుపతికి వచ్చే భక్తులు కూడా ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.
IRCTC Tirupati Theertham: ఐఆర్సీటీసీ తిరుపతి తీర్థం పేరుతో 1 రాత్రి, 2 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్ ఆలయం కవర్ అవుతుంది. ఈ ప్యాకేజీ ధర రూ.4,770. నాన్ ఏసీ వాహనంలో ప్రయాణం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. తిరుపతికి వచ్చే భక్తులు కూడా ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.
IRCTC Pancha Devalayam: ఐఆర్సీటీసీ పంచ దేవాలయం పేరుతో 1 రాత్రి, 2 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్, కాణిపాకం ఆలయాలు కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ ధర రూ.4,800. నాన్ ఏసీ వాహనంలో ప్రయాణం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. తిరుపతికి వచ్చే భక్తులు కూడా ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.
IRCTC Ultimate Ooty: ఐఆర్సీటీసీ అల్టిమేట్ ఊటీ పేరుతో 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీలో ఊటీ, కూనూర్‌లోని పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ ధర రూ.9,790. రైలు టికెట్లు, సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
IRCTC Coastal Karnataka: ఐఆర్సీటీసీ కోస్టల్ కర్నాటక పేరుతో 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీలో గోకర్ణ, కొల్లూర్, మంగళూరు, మురుడేశ్వర్, శృంగేరి, ఉడుపిలోని పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ ధర రూ.10,710. రైలు టికెట్లు, సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
IRCTC Divine Karnataka: ఐఆర్సీటీసీ డివైన్ కర్నాటక పేరుతో 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీలో కుక్కి సుబ్రమణ్య, మంగళూరు, శృంగేరి, ఉడుపిలోని పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ ధర రూ.11,430. రైలు టికెట్లు, సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.