Home /News /business /

IRCTC TOURISM OPERATING TIRUPAT FLIGHT TOUR PACKAGE FROM HYDERABAD KNOW TOUR PACKAGE DETAILS SS

IRCTC Tirupati Tour: హైదరాబాద్ నుంచి ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఐఆర్‌సీటీసీ తిరుపతి టూర్ ప్యాకేజీ

IRCTC Tirupati Tour: హైదరాబాద్ నుంచి ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఐఆర్‌సీటీసీ తిరుపతి టూర్ ప్యాకేజీ
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Tirupati Tour: హైదరాబాద్ నుంచి ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఐఆర్‌సీటీసీ తిరుపతి టూర్ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Tirupati Tour | ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి ఆగస్ట్, సెప్టెంబర్‌లో తిరుపతి టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. ఫ్లైట్‌లో తిరుపతి తీసుకెళ్లి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది.

శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లాలనుకునే శ్రీవారి భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి తిరుపతికి ఆగస్ట్, సెప్టెంబర్‌లో తిరుపతి టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. 'తిరుపతి బాలాజీ దర్శనం' (Tirupati Balaji Darshanam) పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఆగస్ట్ 4, 5, 11, 12, 18, 19, 25, సెప్టెంబర్ 1, 2, 8, 9, 15, 16, 22 తేదీల్లో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఇది ఒక రాత్రి, రెండు రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం, శ్రీనివాసమంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాలు కవర్ అవుతాయి. తిరుపతి బాలాజీ దర్శనం టూర్ ఎలా సాగుతుందో తెలుసుకోండి.

ఐఆర్‌సీటీసీ టూరిజం తిరుపతి బాలాజీ దర్శనం టూర్ ప్యాకేజీ వివరాలు చూస్తే పర్యాటకులు మొదటిరోజు హైదరాబాద్‌లో మధ్యాహ్నం 12.50 గంటలకు ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 1.55 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, తిరుచానూర్ ఆలయాల సందర్శన ఉంటుంది. రాత్రికి తిరుపతిలోనే బస చేయాలి.

IRCTC Tour: విశాఖపట్నం నుంచి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ... ఫ్లైట్‌లో సౌత్ ఇండియా టూర్

రెండో రోజు ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనం ఉంటుంది. స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత శ్రీకాళహస్తి బయల్దేరాలి. శ్రీకాళహస్తిలో దర్శనం పూర్తైన తర్వాత పర్యాటకుల్ని తిరుపతి విమానాశ్రయం దగ్గర డ్రాప్ చేస్తారు. రాత్రి 8 గంటలకు తిరుపతిలో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఐఆర్‌సీటీసీ టూరిజం తిరుపతి బాలాజీ దర్శనం టూర్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.12,165, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.12,260, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.13,945 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, ఒక రాత్రి తిరుపతిలో బస, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

IRCTC Shirdi Tour: విజయవాడ నుంచి షిరిడీకి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ



ఐఆర్‌సీటీసీ టూరిజం ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ నుంచి తిరుపతికి వేర్వేరు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. ట్రైన్ టూర్ ప్యాకేజీలతో పాటు ఫ్లైట్ టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: IRCTC, IRCTC Tourism, Tirumala, Tirumala news, Tirumala Temple, Tirupati

తదుపరి వార్తలు