హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Araku Tour: అరకు టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీ మీకోసమే

IRCTC Araku Tour: అరకు టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీ మీకోసమే

IRCTC
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Araku Tour | ఈ చలికాలంలో అరకు అందాలు చూడాలనుకునే పర్యాటకులకు గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం 'వైజాగ్ రీట్రీట్' (IRCTC Vizag Retreat) పేరుతో అరకు టూర్ ప్యాకేజీ అందిస్తోంది.

ఆంధ్రా ఊటీగా పేరున్న అరకు వెళ్లే పర్యాటకుల సంఖ్య శీతాకాలంలో ఎక్కువగానే ఉంటుంది. అక్టోబర్ నుంచి జనవరి వరకు అరకులో పర్యాటకుల (Araku Tour) తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అరకు టూర్ వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'వైజాగ్ రీట్రీట్' పేరుతో ఈ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ అందిస్తోంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ విశాఖపట్నం నుంచి ప్రారంభం అవుతుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో అరకు, సింహాచలం, విశాఖపట్నం కవర్ అవుతాయి.

టూర్ సాగేది ఇలాగే...


ఐఆర్‌సీటీసీ టూరిజం ఆపరేట్ చేసే 'వైజాగ్ రీట్రీట్' టూర్ ఎలా సాగుతుందో చూస్తే... మొదటి రోజు ఉదయం పర్యాటకుల్ని విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్‌లో రిసీవ్ చేసుంటారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత తోట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, రామానాయుడు ఫిల్మ్ స్టూడియో, రుషికొండ బీచ్ సందర్శించొచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత కైలాసగిరి, బీచ్ రోడ్, ఫిషింగ్ హార్బర్ సందర్శన ఉంటుంది. రాత్రికి వైజాగ్‌లోనే బస చేయాలి.

IRCTC Shirdi Tour: తిరుపతి నుంచి షిరిడీకి ఐఆర్‌సీటీసీ టూర్... ప్యాకేజీ వివరాలివే

రెండో రోజు ఉదయం 8 గంటలకు అరకుకు బయల్దేరాలి. దారిలో జంగిల్ బెల్స్, పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం సందర్శించొచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు సందర్శించొచ్చు. సాయంత్రం విశాఖపట్నానికి తిరిగి బయల్దేరాలి. రాత్రికి విశాఖపట్నంలో బస చేయాలి. మూడో రోజు ఉదయం సింహాచలం సందర్శన ఉంటుంది. ఆ తర్వాత పర్యాటకుల్ని విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్‌లో డ్రాప్ చేయడంతో టూర్ ముగుస్తుంది.

IRCTC Tirumala Tour: శ్రీవారి ప్రత్యేక దర్శనంతో రూ.3,220 ధరకే తిరుపతి టూర్... విజయవాడ నుంచి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ

ప్యాకేజీ వివరాలు


ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీ ధర చూస్తే ఒకరి నుంచి ముగ్గురి వరకు బుక్ చేసుకుంటే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.6,960, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.9,820, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.18,140 చెల్లించాలి. నలుగురి నుంచి ఆరుగురి వరకు ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.9,910, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.12,745 చెల్లించాలి.

ఈ టూర్ ప్యాకేజీలో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి పికప్, డ్రాప్, రెండు రాత్రులు విశాఖపట్నంలో రెండు రాత్రులు బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీలో లంచ్, విశాఖపట్నంలో బోటింగ్ ఛార్జీలు, యాత్రా స్థలాల్లో ఎంట్రీ ఫీజులు, రూమ్ సర్వీస్, ఇతర ఖర్చులేవీ కవర్ కావు.

First published:

Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, Best tourist places, IRCTC, IRCTC Tourism, Telugu news, Telugu varthalu, Tourism, Tourist place, Travel

ఉత్తమ కథలు