కాశ్మీర్ అందాలు చూడాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) మరోసారి కాశ్మీర్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. గతంలో 'మిస్టికల్ కాశ్మీర్ విత్ హౌజ్ బోట్ అకామడేషన్' పేరుతో టూర్ ప్యాకేజీ అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టూర్ ప్యాకేజీని మరోసారి ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి పర్యాటకుల్ని కాశ్మీర్ తీసుకెళ్తోంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీలు గుల్మార్గ్, పహల్గామ్, శ్రీనగర్, సోన్మార్గ్ లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. పర్యాటకులకు హౌజ్ బోట్లో వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ టూర్ హైదరాబాద్‌లో 2022 మార్చి 1, 11, 21 తేదీల్లో టూర్ ప్రారంభమవుతుంది.
ఐఆర్సీటీసీ 'మిస్టికల్ కాశ్మీర్ విత్ హౌజ్ బోట్ అకామడేషన్' టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. తెల్లవారుజామున 5 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 7:15 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీలో మధ్యాహ్నం 12:25 గంటలకు ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 1:40 గంటలకు శ్రీనగర్ చేరుకుంటారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత ఖాళీ సమయం ఉంటుంది. షాపింగ్‌కు వెళ్లొచ్చు. రాత్రికి శ్రీనగర్‌లోనే బస చేయాలి.
IRCTC Tour: రాజస్తాన్ వెళ్తారా? ఫ్లైట్ టూర్ ప్యాకేజీ అందిస్తున్న ఐఆర్సీటీసీ
Always wanted to experience #Kashmir on a houseboat? Tick it off your bucket list with #IRCTCTourism's 6D/5N air tour package starting at Rs. 25,735/-pp*. #Book now on https://t.co/0wU7e2egof. *T&C Apply
— IRCTC (@IRCTCofficial) January 12, 2022
రెండో రోజు ఉదయం పర్యాటకుల్ని శంకరాచార్య ఆలయ దర్శనానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత మొఘల్ గార్డెన్స్, చెష్మాషాహి, పరిమహల్, బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్ సందర్శించొచ్చు. ఆ తర్వాత దాల్ సరస్సు ఒడ్డున ఉన్న హజ్రత్ బల్ క్షేత్రం సందర్శన ఉంటుంది. సాయంత్రం పర్యాటకులు సంత ఖర్చులతో దాల్ సరస్సులో షికారా రైడ్‌కు వెళ్లొచ్చు. ఆ తర్వాత ఫ్లోటింగ్ గార్డెన్స్ చార్ చినార్ సందర్శించాలి.
మూడో రోజు ఉదయం రోడ్డు మార్గంలో గుల్మార్గ్ తీసుకెళ్తారు. ఆ తర్వాత ఖిలాన్ మార్గ్‌కు ట్రెక్కింగ్ ఉంటుంది. పర్యాటకులు సొంత ఖర్చులతో గోండోలా పాయింట్, సైట్ సీయింగ్ వెళ్లొచ్చు. సాయంత్రం శ్రీనగర్‌కు చేరుకున్న తర్వాత అక్కడే బస చేయాలి. నాలుగో రోజు ఉదయం పహల్గామ్ బయల్దేరాలి. సాఫ్రన్ ఫీల్డ్స్, అవంతిపుర రుయిన్స్ సందర్శించొచ్చు. మధ్యాహ్నం తిరిగి శ్రీనగర్‌కు బయల్దేరాలి. అయితే పర్యాటకులు తమ సొంత ఖర్చుతో పహల్గామ్ నుంచి మినీ స్విట్జర్లాండ్, ఇతర సైట్ సీయింగ్ ప్లేసెస్‌కి చూడొచ్చు. రాత్రికి శ్రీనగర్‌లోనే బస చేయాలి.
ఇక ఐదో రోజు ఉదయం సోన్మార్గ్ బయల్దేరాలి. ఫుల్ డే ట్రిప్ ఉంటుంది. తాజివాస్ గ్లేసియర్ సందర్శించొచ్చు. సాయంత్రం శ్రీనగర్ చేరుకుంటారు. రాత్రికి పర్యాటకులకు హౌజ్ బోట్లో బస ఏర్పాట్లు ఉంటాయి. ఆరో రోజు ఉదయం తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఉదయం 10:40 గంటలకు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో బయల్దేరితే మధ్యాహ్నం 3:35 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. సాయంత్రం 5:45 గంటలకు ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 10:00 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ 'మిస్టికల్ కాశ్మీర్ విత్ హౌజ్ బోట్ అకామడేషన్' టూర్ ప్యాకేజీ ప్రారంభ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.25,735 కాగా, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.26,460, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.33,505 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్లో బస, ఒక రాత్రి హౌజ్ బోట్లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, IRCTC, IRCTC Tourism, Kashmir, Tourism, Travel