హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Tours: హైదరాబాద్ నుంచి రూ.12,000 లోపు టూర్ ప్యాకేజీలు ఇవే

IRCTC Tours: హైదరాబాద్ నుంచి రూ.12,000 లోపు టూర్ ప్యాకేజీలు ఇవే

IRCTC Tours: హైదరాబాద్ నుంచి రూ.12,000 లోపు టూర్ ప్యాకేజీలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Tours: హైదరాబాద్ నుంచి రూ.12,000 లోపు టూర్ ప్యాకేజీలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Tours | సమ్మర్‌లో టూర్లకు వెళ్లాలనుకునే హైదరాబాద్‌వాసులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి అనేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. రూ.12,000 లోపు టూర్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి.

వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి టూర్ వెళ్లాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) అనేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. దేశంలోని పలు నగరాల నుంచి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న పర్యాటక కేంద్రాలకు తీసుకెళ్తోంది. హైదరాబాద్ నుంచి కూడా అనేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. రెండు మూడు రోజులు చిన్న ట్రిప్ వేయాలనుకునేవారి నుంచి, వారం రోజుల పాటు విహార యాత్రకు వెళ్లాలనుకునేవారి వరకు వేర్వేరు టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. మరి హైదరాబాద్ నుంచి రూ.12,000 లోపు ఉన్న టూర్ ప్యాకేజీల వివరాలు తెలుసుకోండి.

IRCTC Govindam Tour: ఐఆర్‌సీటీసీ గోవిందం పేరుతో హైదరాబాద్ నుంచి తిరుపతికి టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్ పద్మావతి అమ్మవారి ఆలయం కవర్ అవుతుంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.3,690. రైలు టికెట్లు, హోటల్‌లో వసతి, దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

IRCTC Tirupati Tour: విశాఖపట్నం నుంచి తిరుపతికి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

IRCTC Poorva Sandhya Tour: ఐఆర్‌సీటీసీ పూర్వ సంధ్య పేరుతో హైదరాబాద్ నుంచి తిరుపతికి మరో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలు కవర్ అవుతాయి. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.4,930. రైలు టికెట్లు, హోటల్‌లో వసతి, దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

IRCTC Shirdi Tour: ఐఆర్‌సీటీసీ షిరిడీ సాయి దర్శన్ విత్ శనిశింగ్నాపూర్ పేరుతో హైదరాబాద్ నుంచి షిరిడీకి టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీలో సాయిబాబా దర్శనంతో శనిశింగ్నాపూర్ కవర్ అవుతుంది. 1 రాత్రులు, 2 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.9,540. ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో వసతి, దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

IRCTC Tirupati Balaji Darshanam: ఐఆర్‌సీటీసీ తిరుపతి బాలాజీ దర్శనం పేరుతో హైదరాబాద్ నుంచి తిరుపతికి టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనం మాత్రమే కవర్ అవుతుంది. 1 రాత్రులు, 2 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,315. ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో వసతి, దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

IRCTC Kerala Tour: హైదరాబాద్ నుంచి కేరళకు సమ్మర్ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

IRCTC Ultimate Ooty: ఐఆర్‌సీటీసీ అల్టిమేట్ ఊటీ పేరుతో ఊటీకి టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో ఊటీ, కూనూర్‌లోని పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,450. రైలు టికెట్లు, హోటల్‌లో వసతి, దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

IRCTC Coastal Karnataka: ఐఆర్‌సీటీసీ కోస్టల్ కర్నాటక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో మురుడేశ్వర్, శృంగేరి, ఉడుపి లాంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.11,090. రైలు టికెట్లు, హోటల్‌లో వసతి, దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

IRCTC Divine Karnataka: ఐఆర్‌సీటీసీ డివైన్ కర్నాటక పేరుతో కర్నాటకకు మరో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో ధర్మస్థల, మంగళూరు, శృంగేరి, ఉడుపి లాంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.11,820. రైలు టికెట్లు, హోటల్‌లో వసతి, దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Hyderabad, IRCTC, IRCTC Tourism, Tirupati, Tourism, Travel

ఉత్తమ కథలు