హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Tours: రూ.20,000 లోపు విశాఖపట్నం నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజెస్

IRCTC Tours: రూ.20,000 లోపు విశాఖపట్నం నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజెస్

IRCTC Tours: రూ.20,000 లోపు విశాఖపట్నం నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజెస్
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Tours: రూ.20,000 లోపు విశాఖపట్నం నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజెస్ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Tours | విశాఖపట్నంవాసులకు గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు విశాఖపట్నం నుంచి టూర్ ప్యాకేజెస్ (Tour Packages) అందిస్తోంది. రూ.20,000 లోపు టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.

సమ్మర్ హాలిడేస్‌లో టూర్లకు వెళ్లాలనుకునే విశాఖపట్నం (Visakhapatnam) వాసులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) విశాఖపట్నం నుంచి పలు ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలు (Tour Packages) రూ.2,000 నుంచి ప్రారంభం అవుతాయి. రూ.20,000 లోపు బడ్జెట్‌లో పలు రకాల టూర్ ప్యాకేజీలు ఉన్నాయి. ఒక రోజు టూర్ నుంచి మూడు నాలుగు రోజుల ట్రిప్ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. విశాఖపట్నం నుంచి అరకు, తిరుమల లాంటి ప్రాంతాలకు తక్కువ బడ్జెట్‌లో టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. విశాఖపట్నం వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వైజాగ్ చేరుకునేవారు ఈ ప్యాకేజీలు బుక్ చేయొచ్చు. మరి ఈ టూర్ ప్యాకేజీలు బుక్ చేసుకుంటే ఏఏ ప్రాంతాలు చూడొచ్చో తెలుసుకోండి.

IRCTC Araku Tour: ఐఆర్‌సీటీసీ టూరిజం విశాఖపట్నం నుంచి అరకు వెళ్లేవారి కోసం రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ అందిస్తోంది. ఇది ఒక రోజు టూర్ మాత్రమే. విశాఖప్నంలో ఉదయం బయల్దేరితే అరకులోని పర్యాటక ప్రాంతాలు చూసుకొని రాత్రి వరకు తిరిగి విశాఖపట్నం చేరుకుంటారు. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.2,185. ప్యాకేజీలో రైలు ప్రయాణం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

IRCTC Tours: హైదరాబాద్ నుంచి రూ.12,000 లోపు టూర్ ప్యాకేజీలు ఇవే

IRCTC Vizag Bliss Tour: ఐఆర్‌సీటీసీ టూరిజం వైజాగ్ బ్లిస్ పేరుతో విశాఖపట్నం నుంచి టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఇది 1 రాత్రి, 2 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతాలతో పాటు సింహాచలం కవర్ అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.3,485. ప్యాకేజీలో ప్రయాణం, హోటల్‌లో వసతి, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

IRCTC Vizag Araku Tour: ఐఆర్‌సీటీసీ టూరిజం వైజాగ్ అరకు పేరుతో విశాఖపట్నం నుంచి టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతాలతో పాటు అరకు కవర్ అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.6,405. ప్యాకేజీలో ప్రయాణం, హోటల్‌లో వసతి, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

IRCTC Vizag Retreat: ఐఆర్‌సీటీసీ టూరిజం వైజాగ్ రీట్రీట్ పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో విశాఖపట్నం, అరకు, సింహాచలం లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.8,910. ప్యాకేజీలో ప్రయాణం, హోటల్‌లో వసతి, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

IRCTC Weekend Trip to Tirumala: ఐఆర్‌సీటీసీ టూరిజం వీకెండ్ ట్రిప్ టు తిరుమల పేరుతో విశాఖపట్నం నుంచి టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఇది 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనం కవర్ అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.9,410. ప్యాకేజీలో రైలు ప్రయాణం, హోటల్‌లో వసతి, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

IRCTC Kerala Tour: హైదరాబాద్ నుంచి కేరళకు సమ్మర్ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

IRCTC Tirupati Balaji Darshanam: ఐఆర్‌సీటీసీ టూరిజం తిరుపతి బాలాజీ దర్శనం పేరుతో విశాఖపట్నం నుంచి టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాలు కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.14,865. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో వసతి, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

IRCTC North India Tour: ఐఆర్‌సీటీసీ టూరిజం ఉత్తర భారత్ విత్ మాతా వైష్ణోదేవి పేరుతో విశాఖపట్నం నుంచి టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఇది 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో ఆగ్రా, అమృత్‌సర్, మథుర, వైష్ణోదేవి ఆలయాలు కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.16,650. ప్యాకేజీలో ట్రైన్ టికెట్లు, హోటల్‌లో వసతి, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: IRCTC, IRCTC Tourism, Tirupati, Tourism, Travel, Visakhapatnam

ఉత్తమ కథలు