హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Shimla Tour: సమ్మర్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి షిమ్లా ప్యాకేజీ

IRCTC Shimla Tour: సమ్మర్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి షిమ్లా ప్యాకేజీ

6. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటళ్లలో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబధించిన పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు.  (ప్రతీకాత్మ‌క చిత్రం)

6. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటళ్లలో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబధించిన పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మ‌క చిత్రం)

IRCTC Shimla Tour | హైదరాబాద్ నుంచి షిమ్లా వెళ్లాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

వేసవిలో టూర్ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో చల్లగా ఉండే ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నారా? ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి షిమ్లా టూర్ ప్యాకేజీ (Hyderabad to Shimla) అందిస్తోంది. 'హ్యాపీ హిమాచల్ అండ్ పాపులర్ పంజాబ్' పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఏప్రిల్ 10న ఈ టూర్ ప్రారంభం అవుతోంది. ఫ్లైట్‌లో వెళ్లి అమృత్‌సర్, చండీగఢ్, ధర్మశాల, షిమ్లా లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. మరి ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో, ప్యాకేజీ ధర ఎంతో తెలుసుకోండి.

ఐఆర్‌సీటీసీ టూరిజం 'హ్యాపీ హిమాచల్ అండ్ పాపులర్ పంజాబ్' టూర్ ప్యాకేజీ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. ఉదయం 11:10 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరితే 1:45 గంటలకు చండీగఢ్ చేరుకుంటారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత రాక్ గార్డెన్, సుఖ్నాలేక్ సందర్శన ఉంటుంది. రాత్రికి చండీగఢ్‌లో బస చేయాలి.

IRCTC Tirupati Tour: తిరుపతి సమీపంలో ఈ ఆలయాలను చూశారా? ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ

రెండో రోజు ఉదయం షిమ్లాకు బయల్దేరాలి. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత మాల్ సందర్శన ఉంటుంది. రాత్రికి షిమ్లాలోనే బస చేయాలి. మూడో రోజు కుఫ్రీ సైట్‌సీయింగ్, షిమ్లా లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. రాత్రికి షిమ్లాలోనే బస చేయాలి. నాలుగో రోజు ఉదయం ధర్మశాల బయల్దేరాలి. జ్వాలా దేవి ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి ధర్మశాలలో బస చేయాలి. ఇక ఐదో రోజు ధర్మశాల లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. ఐదో రోజు రాత్రికి ధర్మశాలలో బస చేయాలి.

ఆరో రోజు అమృత్‌సర్‌కు బయల్దేరాలి. రాత్రికి అమృత్‌సర్‌లో బస చేయాలి. ఏడో రోజు జలియన్‌వాలాబాగ్, గోల్డెన్ టెంపుల్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత వాఘా బార్డర్‌కు వెళ్లొచ్చు. రాత్రికి అమృత్‌సర్‌లో బస చేయాలి. ఎనిమిదో రోజు సాయంత్రం చండీగఢ్ ఎయిర్‌పోర్టులో 04:15 గంటలకు ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 06:50 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

IRCTC Kukke Tour: అద్దాల రైలులో కుక్కి టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

ఐఆర్‌సీటీసీ టూరిజం 'హ్యాపీ హిమాచల్ అండ్ పాపులర్ పంజాబ్' టూర్ ప్యాకేజీ ధర వివరాలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.33,100, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.34,100, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.46,950 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో చండీగఢ్‌, షిమ్లా, ధర్మశాల, అమృత్‌సర్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఆలయాలు, సైట్ సీయింగ్ ప్లేసెస్‌లో ఎంట్రెన్స్ టికెట్లు, లంచ్, హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు పికప్, డ్రాప్, ఫ్లైట్‌లో మీల్స్ లాంటివి కవర్ కావు.

First published:

Tags: IRCTC, IRCTC Tourism, Tourism, Travel

ఉత్తమ కథలు