షిరిడీ వెళ్లాలనుకునే సాయిబాబా భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి షిరిడీకి (Hyderabad to Shirdi) ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. సాయి సన్నిధి పేరుతో ట్రైన్ టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీ, శనిశిగ్నాపూర్ కవర్ అవుతాయి. ప్రతీ బుధవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. సాయిబాబా భక్తులు గురువారం రోజు షిరిడీ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర ఒకరికి రూ.3,170 మాత్రమే. మరి ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో తెలుసుకోండి.
ఐఆర్‌సీటీసీ టూరిజం సాయి సన్నిధి టూర్ ప్యాకేజీ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు సాయంత్రం 6.50 గంటలకు అజంతా ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి. మరుసటి రోజు ఉదయం నాగర్సోల్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ్నుంచి పర్యాటకుల్ని షిరిడీకి తీసుకెళ్తారు. భక్తులు సొంత ఖర్చులతో షిరిడీలో సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవాలి.
Train Tickets: ఈ ట్రిక్‌తో బుక్ చేస్తే ట్రైన్ టికెట్స్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ
షిరిడీలో సాయిబాబా దర్శనం పూర్తైన తర్వాత సాయంత్రం 4 గంటలకు శనిశిగ్నాపూర్ బయల్దేరాలి. అక్కడి శని ఆలయాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాత నాగర్సోల్ బయల్దేరాలి. రాత్రి 9.20 గంటలకు నాగర్సోల్ స్టేషన్‌లో రైలు ఎక్కితే మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్‌సీటీసీ టూరిజం సాయి సన్నిధి టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే స్టాండర్డ్‌లో ట్రిపుల్ షేరింగ్ ఒకరికి రూ.3,170, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.3,700 చెల్లించాలి. కంఫర్ట్‌లో ట్రిపుల్ షేరింగ్ ఒకరికి రూ.4,860, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.5,390 చెల్లించాలి. గ్రూప్ బుకింగ్ చేసేవారికి ఈ ఛార్జీలు వర్తిస్తాయి.
LIC Policy: రోజూ రూ.40 పొదుపు... రూ.25 లక్షల రిటర్న్స్... ఈ ఎల్ఐసీ పాలసీతో సాధ్యం
స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో ఏసీ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్‌సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఆలయాల్లో దర్శనం టికెట్లు, లంచ్, డిన్నర్, రైలులో ఫుడ్, సైట్‌సీయింగ్ ప్లేసెస్ దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్ లాంటివి ఈ టూర్ ప్యాకేజీలో కవర్ కావు.
తెలంగాణ టూరిజం షిరిడీ సాయి భక్తుల కోసం మరిన్ని టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. షిరిడీ, నాసిక్, త్రయంబకేశ్వర్ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.3,100. ఈ ప్యాకేజీలో షిరిడీ సాయిబాబా దర్శనంతో పాటు నాసిక్, త్రయంబకేశ్వర్ కూడా కవర్ అవుతాయి. కేవలం షిరిడీ సాయిబాబా దర్శనం చేసుకోవాలనుకునేవారికి రూ.2400 ధరకే మరో ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇందులో కేవలం షిరిడీ మాత్రమే కవర్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IRCTC, IRCTC Tourism, Shirdi, Shiridi sai