హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC: ఊటీకి హనీమూన్ వెళ్తారా? హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

IRCTC: ఊటీకి హనీమూన్ వెళ్తారా? హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

IRCTC: ఊటీకి హనీమూన్ వెళ్తారా? హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC: ఊటీకి హనీమూన్ వెళ్తారా? హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC | సమ్మర్‌లో హనీమూన్ వెళ్లాలనుకునే జంటల కోసం, కుటుంబ సభ్యులతో టూర్ వెళ్లాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం ఊటీ టూర్ ప్యాకేజీ (Ooty Tour) ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

హనీమూన్ వెళ్లాలనుకునే కొత్త జంటలకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి ఊటీకి టూర్ ప్యాకేజీ (Ooty Tour Package) ప్రకటించింది. అల్టిమేట్ ఊటీ (Ultimate Ooty) పేరుతో రైల్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీలో ఊటీ, కూనూర్ లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకునే పర్యాటకులు పశ్చిమ కనుమల్లోని ఊటీ, కూనూర్ అందాలను చూడొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. మంగళవారం టూర్ ప్రారంభమై, ఆదివారం టూర్ ముగుస్తుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఐఆర్‌సీటీసీ ఊటీ టూర్ ప్యాకేజీ వివరాలివే...


ఐఆర్‌సీటీసీ ఊటీ టూర్ ప్యాకేజీ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. పర్యాటకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం 12:20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి. రాత్రంతా జర్నీ ఉంటుంది. రెండో రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ్నుంచి ఊటీకి వాహనంలో తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ సందర్శించొచ్చు. రాత్రికి ఊటీలోనే బస చేయాలి.

IRCTC North India Tour: తిరుపతి, విజయవాడ, సికింద్రాబాద్ నుంచి ఉత్తర భారతదేశ యాత్ర... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

మూడో రోజు ఉదయం దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ సందర్శన ఉంటుంది. నాలుగో రోజు కూనూర్ సైట్‌సీయింగ్ ఉంటుంది. ఐదో రోజు ఉదయం ఊటీ నుంచి కొయంబత్తూర్ బయల్దేరాలి. కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 4.35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కితే ఆరోరోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

IRCTC: రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్... రైల్వే స్టేషన్ల దగ్గర కొత్త సర్వీస్

ఐఆర్‌సీటీసీ ఊటీ టూర్ ప్యాకేజీ ధర వివరాలు చూస్తే స్టాండర్డ్ క్లాస్ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.9,730, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.12,190, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.22,150. ఇక కంఫస్ట్ క్లాస్ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.12,190, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.14,640, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.24,610. స్టాండర్డ్ క్లాస్‌లో స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ క్లాస్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ఊటీలో బస, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. లంచ్, డిన్నర్, రైలులో భోజనం, సైట్‌సీయింగ్ ప్లేసెస్‌లో ఎంట్రెన్స్ టికెట్లు, బోటింగ్, హార్స్ రైడింగ్ లాంటి యాక్టివిటీస్ ఈ టూర్ ప్యాకేజీలో కవర్ కావు.

First published:

Tags: Hyderabad, IRCTC, IRCTC Tourism, Tourism, Travel

ఉత్తమ కథలు