Home /News /business /

IRCTC TOURISM OFFERS ONE DAY HERITAGE HYDERABAD TOUR PACKAGE JUST AT RS 505 PER PERSON KNOW PACKAGE DETAILS SS

IRCTC Hyderabad Tour: ఐదు వందలకే హైదరాబాద్ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

IRCTC Hyderabad Tour: ఐదు వందలకే హైదరాబాద్ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Hyderabad Tour: ఐదు వందలకే హైదరాబాద్ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Heritage Hyderabad Tour | ఒక్క రోజులో హైదరాబాద్‌లోని చారిత్రక ప్రాంతాలన్నీ చూడాలనుకుంటున్నారా? కేవలం రూ.505 ధరకే టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. పూర్తి వివరాలు తెలుసుకోండి.

    లాక్‌డౌన్‌లో ఎక్కడికీ వెళ్లే అవకాశం లేక బోర్ కొట్టేసిందా? కాస్త రిలాక్స్ అయ్యేందుకు ఎక్కడికైనా వెళ్దామనుకుంటున్నారా? ఒకరోజు ఫ్యామిలీతో సరదాగా గడపాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC టూర్ ప్యాకేజీలను అందిస్తుందన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కాలంలో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలను నిలిపివేసింది. కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో మళ్లీ టూర్ ప్యాకేజీలను ప్రారంభించింది. ఐఆర్‌సీటీసీ టూరిజం తిరిగి ప్రారంభించిన టూర్ ప్యాకేజీల్లో హెరిటేజ్ హైదరాబాద్ వన్ డే టూర్ ప్యాకేజీ కూడా ఉంది. ఈ ప్యాకేజీ ధర ఒకరికి రూ.505 మాత్రమే.

    ఐఆర్‌సీటీసీ టూరిజం హెరిటేజ్ హైదరాబాద్ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారు ఒక రోజులో హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలను చూడొచ్చు. ఇది ఒక రోజు ప్యాకేజీ మాత్రమే. సోమవారం, శుక్రవారం తప్ప మిగతా ఐదు రోజులు ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల దగ్గర ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం అవుతుంది. సరిగ్గా ఉదయం 8 గంటలకు టూర్ మొదలవుతుంది. అంటే అంతలోపే హైదరాబాద్ చేరుకునేవారికి ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది.

    IRCTC Tirupathi Tour: ఐఆర్‌సీటీసీ తిరుమల ప్యాకేజీ రూ.990 మాత్రమే... శ్రీవారి దర్శనం కూడా

    IRCTC Ticket Booking: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం

    సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల దగ్గర ఉదయం 8 గంటలకు పర్యాటకులకు స్వాగతం పలుకుతారు ఐఆర్‌సీటీసీ టూరిజం సిబ్బంది. ఆ తర్వాత సైట్ సీయింగ్‌కు బయల్దేరతారు. ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, సాలార్‌జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీద్, చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్ చూడొచ్చు. టూర్ ముగిసిన తర్వాత పర్యాటకులను రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, టోల్ ఛార్జీలు, పార్కింగ్ ఛార్జీలు, డ్రైవర్ బత్తా, పన్నులు ప్యాకేజీలో కవర్ అవుతాయి. వసతి, భోజన సదుపాం, పర్యాటక ప్రాంతాల దగ్గర ఎంట్రెన్స్ ఫీజులు ఈ ప్యాకేజీలో కవర్ కావు.

    IRCTC Tirupati Tour: తిరుమలలో శ్రీవారి దర్శనంతో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

    IRCTC Work From Hotel: బీచ్‌లో కూర్చొని ఉద్యోగం చేసుకోండి... ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

    గ్రూప్ టూర్ వెళ్లాలనుకునేవారికి ఉపయోగపడే టూర్ ప్యాకేజీ ఇది. 13 నుంచి 22 మంది ప్యాకేజీ బుక్ చేసుకుంటే ఒకరికి రూ.505 చెల్లించాలి. 7 నుంచి 12 మంది ప్యాకేజీ బుక్ చేసుకుంటే ఒకరికి రూ.1,145 చెల్లించాలి. 4 నుంచి 6 మంది ప్యాకేజీ బుక్ చేసుకుంటే ఒకరికి రూ.1,170 చెల్లించాలి. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Charminar, Hyderabad, Hyderabad news, Indian Railway, Indian Railways, Irctc, Railways, Special Trains, Train, Train tickets, Travel

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు