• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • IRCTC TOURISM OFFERS MYSTICAL KASHMIR WITH HOUSE BOAT GROUP TOUR SPECIAL PACKAGE FROM HYDERABAD SS

IRCTC: హైదరాబాద్ టు కాశ్మీర్... ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

IRCTC: హైదరాబాద్ టు కాశ్మీర్... ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

IRCTC: హైదరాబాద్ టు కాశ్మీర్... ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Hyderabad-Kashmir Tour Package | ఫ్లైట్ ఛార్జీలు, ఒక రోజు హౌజ్ హోట్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనం లాంటివి ప్యాకేజీలో ఉంటాయి. ఎంట్రెన్స్ టికెట్స్, లంచ్ లాంటివి ప్యాకేజీలో కవర్ కావు.

  • Share this:
    ఎక్కడికైనా టూర్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కాశ్మీర్ ప్యాకేజీ అందిస్తోంది. 'మిస్టికల్ కాశ్మీర్ విత్ హౌజ్‌బోట్ గ్రూప్ టూర్ స్పెషల్' పేరుతో ఈ ప్యాకేజీ రూపొందించింది. ఐదు రాత్రులు, ఆరు రోజుల ప్యాకేజీలో శ్రీనగర్, గుల్మార్గ్, సోన్మార్గ్, పహల్గమ్ లాంటి ప్రాంతాలకు తీసుకెళ్తుంది ఐఆర్‌సీటీసీ. హైదరాబాద్ నుంచి మొదలయ్యే టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే... ఒకరికి సింగిల్ ఆక్యుపెన్సీ రూ.28115, డబుల్ ఆక్యుపెన్సీ రూ.23790, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.23170. ఐఆర్‌సీటీసీ కాశ్మీర్ టూర్ ఆగస్ట్ 26న హైదరాబాద్‌లో ప్రాంభమవుతుంది. ఫ్లైట్ ఛార్జీలు, ఒక రోజు హౌజ్ హోట్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనం లాంటివి ప్యాకేజీలో ఉంటాయి. ఎంట్రెన్స్ టికెట్స్, లంచ్ లాంటివి ప్యాకేజీలో కవర్ కావు.


    IRCTC Kashmir Tour Package: ఐఆర్‌సీటీసీ కాశ్మీర్ టూర్ ప్యాకేజీ వివరాలివే...


    ఉదయం 5:40 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్‌లో బయల్దేరతారు. 8 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ నుంచి 10:25 గంటలకు శ్రీనగర్‌కు ఫ్లైట్‌లో బయల్దేరతారు. 11:55 గంటలకు శ్రీనగర్‌కు చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్‌కు తీసుకెళ్తారు. విశ్రాంతి తర్వాత షాపింగ్‌కు తీసుకెళ్తారు. రాత్రి హోటల్‌లో భోజనం చేసి బస చేయాలి. ఆగస్ట్ 27న బ్రేక్‌ఫాస్ట్ తర్వాత శంకరాచార్య ఆలయ దర్శనం, మొఘల్ గార్డెన్స్, పారిమహల్, బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్స్, జరార్వాన్ హిల్స్ సైట్‌సీయింగ్ ఉంటుంది. దాల్ సరస్సు ఒడ్డున హజ్రత్ బల్ మందిరాన్ని దర్శించుకున్న తర్వాత షికారా రైడ్ ఉంటుంది. ఫ్లోటింగ్ గార్డెన్స్ చూసిన తర్వాత హోటల్‌కు చేరుకోవాలి. ఆగస్ట్ 28న గుల్మార్గ్ సైట్ సీయింగ్ ఉంటుంది. ఆగస్ట్ 29న పహల్గామ్ తీసుకెళ్తారు. ఆగస్ట్ 30న సోన్‌మార్గ్ ఫుల్ డే ట్రిప్ ఉంటుంది. ఆగస్ట్ 31న సాయంత్రం 16:05 గంటలకు ఢిల్లీకి ఫ్లైట్‌లో బయల్దేరాలి. 17:35 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. 18:45 గంటలకు ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి 20:55 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు.

    Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


    ఇవి కూడా చదవండి:

    IRCTC: దుబాయ్ తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ... ప్యాకేజీ ఎంతో తెలుసా?

    IRCTC: హైదరాబాద్‌-గోవా టూర్... తక్కువ ధరకే ప్యాకేజీ

    IRCTC Tour: రూ.6,300 ధరకే హరిద్వార్, రిషికేష్ ప్యాకేజీ
    First published:

    అగ్ర కథనాలు