IRCTC Tour: రూ.6,300 ధరకే హరిద్వార్, రిషికేష్ ప్యాకేజీ

IRCTC Haridwar, Rishikesh and Vaishno Devi tour package | ఆరు రాత్రులు, ఏడు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. నాన్ ఏసీ స్లీపర్ క్లార్ రైలు ప్రయాణం ఉంటుంది. పూర్తిగా శాకాహార భోజనాన్ని అందిస్తుంది ఐఆర్‌సీటీసీ.

news18-telugu
Updated: June 28, 2019, 12:18 PM IST
IRCTC Tour: రూ.6,300 ధరకే హరిద్వార్, రిషికేష్ ప్యాకేజీ
IRCTC Tour: రూ.6,300 ధరకే హరిద్వార్, రిషికేష్ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతదేశంలోని పుణ్యక్షేత్రాలను తక్కువ బడ్జెట్‌లో దర్శించుకోవాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే భారత్ దర్శన్ పేరుతో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది ఐఆర్‌సీటీసీ. భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తాయి ఈ రైళ్లు. రూ.6,300 ధరకే ఓ ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ. ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే హరిద్వార్, రిషికేష్, వైష్ణోదేవీ ఆలయాలను దర్శించుకోవచ్చు. ఆరు రాత్రులు, ఏడు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. నాన్ ఏసీ స్లీపర్ క్లార్ రైలు ప్రయాణం ఉంటుంది. పూర్తిగా శాకాహార భోజనాన్ని అందిస్తుంది ఐఆర్‌సీటీసీ. ప్యాకేజీ వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.

IRCTC Tourism, Haridwar, Rishikesh, Vaishno Devi package, IRCTC tour, IRCTC tour packages, IRCTC tours, ఐఆర్‌సీటీసీ టూరిజం, ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ, ఐఆర్‌సీటీసీ హరిద్వార్, రిషికేష్, వైష్ణోదేవీ ప్యాకేజీ, ఐఆర్‌సీటీసీ టూర్, ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజెస్, ఐఆర్‌సీటీసీ టూర్స్
source: IRCTC


పశ్చిమబెంగాల్‌లోని బర్ధమాన్‌లో ఈ టూర్ మొదలవుతుంది. జూలై 3న ఉదయం బర్ధమాన్‌లో భారత్ దర్శన్ ప్రత్యేక రైలులో టూరిస్టులు బయల్దేరాలి. జూలై 4న మధ్యాహ్నం రైలు హరిద్వార్‌కు చేరుకుంటుంది. మానసాదేవి, చండీదేవి, భారతమాత ఆలయాలను దర్శించుకున్న తర్వాత సాయంత్రం హర్ కీ పౌరీలో గంగా హారతికి హాజరు కావాలి. రాత్రి హరిద్వార్‌లోనే బస చేయాలి. జూలై 5న రిషికేష్‌లో రామ్‌ఝూలా, లక్ష్మణ్ ఝూలా, త్రివేణి ఘాట్ దర్శించుకొని సాయంత్రం రైలులో బయల్దేరాలి. జూలై 6న ఉదయం మాతా వైష్ణోదేవీ ఆలయాన్ని దర్శించుకోవాలి. జూలై 7న తిరిగి బయల్దేరాలి. రైలు జూలై 9న సాయంత్రం బర్ధమాన్‌కు చేరుకుంటుంది. ఐఆర్‌సీటీసీ హరిద్వార్, రిషికేష్ ప్యాకేజీ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో




ఇవి కూడా చదవండి:

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి దుబాయ్ టూర్... ప్యాకేజీ వివరాలివే
Loading...
Free Wifi: రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై వాడుకోండి ఇలా

IRCTC Tour: తక్కువ ధరకే ఐఆర్‌సీటీసీ థాయ్‌ల్యాండ్ టూర్ ప్యాకేజీ
First published: June 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...