విశాఖపట్నం నుంచి కాశ్మీర్ వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఫ్లైట్‌లో వెళ్లి కాశ్మీర్ అందాలు చూడాలనుకునేవారు ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. కాశ్మీర్-హెవెన్ ఆన్ ఎర్త్ (Kashmir - Heaven On Earth) పేరుతో విశాఖపట్నం నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకునేవారు భూతల స్వర్గంగా చెప్పుకొనే జమ్మూ కాశ్మీర్‌లోని అందమైన కొండలు, లోయలు, ప్రకృతి అందాలను చూడొచ్చు. గుల్‌మార్గ్‌లోని మనోహరమైన పచ్చికభూములు, సోన్‌మార్గ్‌లోని మంచు పర్వతాలు, పహల్‌ఘమ్‌లోని అద్భుతమైన లోయ, శ్రీనగర్ కళాత్మక సౌందర్యాన్ని అనుభవించవచ్చు.
ఐఆర్‌సీటీసీ కాశ్మీర్ టూర్ ప్యాకేజీ 2023 ఫిబ్రవరి 24, మార్చి 10, మార్చి 24 తేదీల్లో అందుబాటులో ఉంది. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ ప్యాకేజీ బుక్ చేసుకునేవారికి ఫ్లైట్‌లో తీసుకెళ్లి కాశ్మీర్ అందాలను చూపించనుంది ఐఆర్‌సీటీసీ టూరిజం. మరి ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో తెలుసుకోండి.
PAN Card: పాన్ కార్డ్ విషయంలో ఊరట... బడ్జెట్‌లో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
Experience the scintillating beauty of Kashmir with IRCTC's Kashmir tour package starting from ₹39120/- onwards pp*. For details, visit https://t.co/Pl3VcXy38e@AmritMahotsav @incredibleindia @tourismgoi #AzadiKiRail
— IRCTC (@IRCTCofficial) December 22, 2022
ఐఆర్‌సీటీసీ కాశ్మీర్ టూర్ ప్యాకేజీ మొదటి రోజు విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది. ఉదయం విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రానికి శ్రీనగర్ చేరుకుంటారు. హోటల్‌లో చెకిన్ అయి, ఫ్రెషప్ అయిన తర్వాత షాపింగ్ కోసం సమయం ఉంటుంది. రాత్రికి శ్రీనగర్‌లో బస చేయాలి. రెండో రోజు ఉదయం శంకరాచార్య ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత మొఘల్ గార్డెన్స్, చెష్మా షాహి, పరి మహల్, బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్స్ చూడొచ్చు. తర్వాత దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ప్రసిద్ధ హజ్రత్‌బాల్ క్షేత్రాన్ని సందర్శించాలి. సాయంత్రం సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత చార్-చినార్ ఫ్లోటింగ్ గార్డెన్స్ చూడొచ్చు. పర్యాటకులు సొంత ఖర్చులతో దాల్ సరస్సుపై షికారా రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. రాత్రికి శ్రీనగర్‌లోనే బస చేయాలి.
Pension News: పెన్షన్ రూ.7,500 చేయండి... లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరిక
మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గుల్‌మార్గ్‌లో పుష్పాల అందాలను చూడొచ్చు. పర్యాటకులు సొంత ఖర్చులతో ఖిలాన్‌మార్గ్ వరకు ట్రెక్కింగ్ చేయొచ్చు. రాత్రికి శ్రీనగర్ చేరుకొని అక్కడే బస చేయాలి. నాలుగో రోజు బ్రేఫాస్ట్ తర్వాత పహల్గామ్ బయల్దేరాలి. దారిలో కుంకుమపువ్వు పొలాలు, అవంతిపుర శిథిలాల సందర్శన ఉంటుంది. పర్యాటకులు సొంత ఖర్చులతో జీప్ లేదా పోనీ ద్వారా మినీ స్విట్జర్లాండ్, సమీపంలోని పర్యాటక స్థలాలను సందర్శించవచ్చు. రాత్రికి శ్రీనగర్‌లో బస చేయాలి.
ఐదో రోజు సోన్‌మార్గ్ బయల్దేరాలి. ఫుల్ డే టూర్ ఉంటుంది. వంకలు తిరుగుతూ ఉంటే సింధ్ లోయ గుండా ప్రయాణించవచ్చు. థాజివాస్ గ్లేసియర్ వరకు వెళ్లడానికి పోనీలను అద్దెకు తీసుకోవచ్చు. సాయంత్రానికి శ్రీనగర్ చేరుకోవాలి. హౌస్‌బోట్‌లో డిన్నర్, బస ఉంటాయి. ఆరో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం శ్రీనగర్‌లో బయల్దేరితే రాత్రికి విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
LIC Alert: ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు అలర్ట్... ఆ ఛార్జీలు లేవు
ఐఆర్‌సీటీసీ కాశ్మీర్ టూర్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.39,120, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.39,910, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.49,305 చెల్లించాలి. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IRCTC, IRCTC Tourism, Jammu and Kashmir, Kashmir, Tourism, Travel