హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Araku Tour: విశాఖపట్నం నుంచి అరకు టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

IRCTC Araku Tour: విశాఖపట్నం నుంచి అరకు టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

IRCTC Araku Tour: విశాఖపట్నం నుంచి అరకు టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Araku Tour: విశాఖపట్నం నుంచి అరకు టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Araku Tour | ఐఆర్‌సీటీసీ టూరిజం వరుసగా ప్యాకేజీలను ప్రకటిస్తోంది. వైజాగ్ నుంచి అరకు టూర్ అందిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  అరకు వెళ్లాలనుకునే పర్యాటకులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC టూర్ ప్యాకేజీ ప్రకటించింది. విశాఖపట్నం నుంచి అరకు టూర్ ప్లాన్ చేసుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. వైజాగ్-అరకు హాలిడే ప్యాకేజీ పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాల నుంచి వైజాగ్ వచ్చినవారు అరకు వెళ్లాలనుకుంటే ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. టూరిస్టులు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్టాండ్ చేరుకున్న తర్వాత టూర్ ప్యాకేజీ మొదలవుతుంది. ఈ ప్యాకేజీలో వైజాగ్, అరకులోని పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ఎలా కొనసాగుతుందో తెలుసుకోండి.

  Day 1: పర్యాటకులను వైజాగ్ ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్టాండ్ దగ్గర ఐఆర్‌సీటీసీ సిబ్బంది రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత తోట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, రామానాయుడు ఫిలిమ్ స్టూడియో, రుషికొండ బీచ్ సందర్శించొచ్చు. మధ్యాహ్న భోజనం తర్వాత కైలాసగిరి, సబ్‍మెరైన్ మ్యూజియం, బీచ్ రోడ్, ఫిషింగ్ హార్బర్ సందర్శించొచ్చు. రాత్రికి విశాఖపట్నంలోనే బస చేయాలి.

  IRCTC Tirupati Tour: ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసేవారికి తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం

  IRCTC Char-Dham Yatra: చార్‌ధామ్ యాత్ర ప్రకటించిన ఐఆర్‌సీటీసీ... ప్యాకేజీ ధర ఎంతంటే

  Day 2: రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అరకు బయల్దేరాలి. దారిలో తైడా జంగిల్ బెల్స్, పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం సందర్శించాలి. మధ్యాహ్న భోజనం తర్వాత అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా కేవ్స్ సందర్శించొచ్చు. సాయంత్రం తిరిగి విశాఖపట్నం బయల్దేరాలి. రాత్రికి విశాఖపట్నంలోనే బస చేయాలి.

  Day 3: మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పర్యాటకులను విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.

  IRCTC: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త... పంచదేవాలయం టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

  IRCTC Work From Hotel: హిమాలయాలను చూసుకుంటూ వర్క్ చేసుకోవచ్చు... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

  ఐఆర్‌సీటీసీ వైజాగ్-అరకు హాలిడే ప్యాకేజీ ప్రారంభ ధర రూ.6,160. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.8610, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.15,730 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్టాండ్ నుంచి పికప్ అండ్ డ్రాప్, రెండు రాత్రులు విశాఖపట్నంలో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం, ప్యాకేజీ బుక్ చేయడానికి https://www.irctctourism.com/ వెబ్‌సైట్ చూడండి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, Best tourist places, IRCTC, IRCTC Tourism, Telugu news, Telugu updates, Telugu varthalu, Tourism, Tourist place, Travel, Visakhapatnam

  ఉత్తమ కథలు