ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC హైదరాబాదీలకు గుడ్ న్యూస్ చెప్పింది. 'అమేజింగ్ అండమాన్' పేరుతో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 2020 మార్చి 18న హైదరాబాద్‌లో ఈ టూర్ మొదలవుతుంది. పోర్ట్ బ్లెయిర్, రాస్ అండ్ నార్త్ బే ఐల్యాండ్, హేవ్‌లాక్ ఐల్యాండ్, బారాతంగ్ లాంటి ప్రాంతాలు ఈ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్ https://www.irctctourism.com/ వెబ్సైట్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి పోర్ట్ బ్లెయిర్, పోర్ట్ బ్లెయిర్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ టికెట్లు, నాలుగు రాత్రులు పోర్ట్ బ్లెయిర్‌లో ఏసీ హోటల్లో అకామడేషన్, ఒక రాత్రి హేవ్‌లాక్‌లో ఏసీ హోటల్లో అకామడేషన్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, పోర్ట్ బ్లెయిర్ నుంచి హేవ్ లాక్ వెళ్లి రావడానికి ఫెర్రీ టికెట్స్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి ప్యాకేజీలో కవర్ అవుతాయి.
Dive into the right kind of blues with #IRCTC 'Amazing Andaman' flight package. Soak in the sun, scuba dive, swim...& start the summer with a bang. To book the package, visit https://t.co/MqYdHDOhhe#IRCTCTourism #IndianRailways #IncredibleIndia #booktickets #travel #travel
— IRCTC (@IRCTCofficial) February 18, 2020
మార్చి 18: ఐఆర్సీటీసీ 'అమేజింగ్ అండమాన్' టూర్ మార్చి 18న ప్రారంభం అవుతుంది. తెల్లవారుజామున 05:10 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 07:55 గంటలకు పోర్ట్‌బ్లెయిర్ చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్‌కు తీసుకెళ్తారు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లంచ్ వరకు విశ్రాంతి తీసుకోవచ్చు. లంచ్ తర్వాత కార్బన్స్ కోవ్ బీచ్‌కు తీసుకెళ్తారు. ఆ తర్వాత పోర్ట్ బ్లెయిర్ టౌన్లో సెల్యులార్ జైల్ సందర్శించొచ్చు. సాయంత్రం సెల్యులార్ జైలులో లైట్ అండ్ సౌండ్ షో ఉంటుంది. రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లో బస చేయాలి.
మార్చి 19: రెండో రోజు రాస్ ఐల్యాండ్‌కు బోట్లో తీసుకెళ్తారు. రోజంతా క్రూజ్లోనే ప్రయాణం ఉంటుంది. మ్యూజియం సందర్శించిన తర్వాత నార్త్ బే-కోరల్ ఐల్యాండ్‌కు తీసుకెళ్తారు. సాయంత్రానికి పోర్ట్ బ్లెయిర్ చేరుకోవాలి. రాత్రికి పోర్ట్ బ్లెయిర్ లోనే బస చేయాలి.
మార్చి 20: మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఫెర్రీలో హేవ్ లాక్ ఐల్యాండ్‌కు వెళ్లాలి. అక్కడికి చేరుకున్నాక హోటల్‌కు తీసుకెళ్తారు. లంచ్ తర్వాత రాధానగర్ బీచ్‌కు వెళ్లాలి. స్విమ్మింగ్, సీ బాతింగ్ లాంటి యాక్టివిటీస్ ఉంటాయి. రాత్రికి హేవ్ లాక్‌లో బస చేయాలి.
మార్చి 21: నాలుగో రోజు ఉదయం హోటల్ నుంచి చెకౌట్ కావాలి. లగేజీని లాబీలో భద్రపర్చుకొని కాలాపత్తర్ బీచ్‌కు వెళ్లాలి. లంచ్ తర్వాత ఫెర్రీలో పోర్ట్ బ్లెయిర్‌కు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లో బస చేయాలి.
మార్చి 22: ఐదో రోజు తెల్లవారుజామున పోర్ట్ బ్లెయిర్ నుంచి బారాతంగ్ బయల్దేరాలి. దట్టమైన అడవుల నుంచి నాలుగున్నర గంటలు కారులో 100 కిలోమీటర్ల జర్నీ అద్భుతంగా ఉంటుంది. ఎకో ఫ్రెండ్లీ టూరిజం ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది. దారిలో లైమ్ స్టోన్ కేవ్స్, మడ్ వాల్గొనోస్ లాంటివి చూడొచ్చు. రాత్రికి పోర్ట్ బ్లెయిర్ చేరుకొని అక్కడే బస చేయాలి.
మార్చి 23: ఆరో రోజు ఉదయం 08:25 గంటలకు పోర్ట్ బ్లెయిర్‌లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 10:55 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవడంతో అండమాన్ టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ హైదరాబాద్-అండమాన్ టూర్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.32163, డబుల్ ఆక్యుపెన్సీ రూ.33663, సింగిల్ ఆక్యుపెన్సీ రూ.49980. ఈ ప్యాకేజీ ఒకరికి మాత్రమే. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
IRCTC Tour: ఐఆర్సీటీసీ నుంచి అరకు, సింహాచలం టూర్ ప్యాకేజీ
IRCTC: హైదరాబాద్ నుంచి సౌత్ ఇండియా టూర్... ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే
IRCTC Rules 2020: రైలు టికెట్ క్యాన్సిల్ చేసే ముందు ఈ రూల్స్ మర్చిపోవద్దు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andaman, Best tourist places, Irctc, Tourism