కేరళ అందాలు చూస్తారా? కొచ్చిన్, మున్నార్, అలెప్పీలో పర్యాటక ప్రాంతాలు చూడాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) తక్కువ ధరకే టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. రావిషింగ్ కేరళ విత్ హౌజ్‌బోట్ స్టే పేరుతో ఈ టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్ లేదా ఎర్నాకుళం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం అవుతుంది. అంటే పర్యాటకులు కొచ్చిన్ లేదా ఎర్నాకుళం చేరుకున్న తర్వాతే కేరళ టూర్ ప్యాకేజీ (Kerala Tour Package) ప్రారంభం అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రతీ రోజూ అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు కొచ్చిన్, మున్నార్, తేక్కడి, కుమారకోమ్, అలెప్పీ చూడొచ్చు. హౌజ్‌బోట్‌లో బస కూడా లభిస్తుంది.
ఐఆర్‌సీటీసీ కేరళ టూర్ మొదటి రోజు కొచ్చిన్ లేదా ఎర్నాకుళంలో ప్రారంభం అవుతుంది. పర్యాటకుల్ని పికప్ చేసుకున్న తర్వాత ఎర్నాకుళంలో హోటల్‌లో చెకిన్ కావాలి. ఆ తర్వాత కొచ్చిన్ సైట్ సీయింగ్ ఉంటుంది. డచ్ ప్యాలెస్, జ్యూస్ సినాగోగ్, ఫోర్ట్ కొచ్చిన్ చూడొచ్చు. సాయంత్రం మెరైన్ డ్రైవ్ ఉంటుంది. రాత్రికి కొచ్చిన్‌లో బస చేయాలి.
Higher Pension: అధిక పెన్షన్ కోసం 8,897 మంది అప్లై చేశారు... మీరు దరఖాస్తు చేశారా?
రెండో రోజు మున్నార్ బయల్దేరాలి. దారిలో చీయపర వాటర్ ఫాల్స్ చూడొచ్చు. సాయంత్రం టీ మ్యూజియం సందర్శన ఉంటుంది. ఆ తర్వాత పునార్‌జనిలో సాంస్కృతిక కార్యక్రమాలు చూడొచ్చు. రాత్రికి మున్నార్‌లో బస చేయాలి. మూడో రోజు ఎరవికుళం నేషనల్ పార్క్, కుండల డ్యామ్ లేక్, ఈకో పాయింట్, మెట్టుపట్టి డ్యామ్ చూడొచ్చు. తర్వాత షాపింగ్ కోసం సమయం ఉంటుంది. రాత్రికి మున్నార్‌లో బస చేయాలి.
నాలుగో రోజు తేక్కడి బయల్దేరాలి. మధ్యాహ్నం పెరియార్ వైల్డ్ లైఫ్ సాంక్చరీ, స్పైస్ ప్లాంటేషన్ చూడొచ్చు. రాత్రికి తేక్కడిలోనే బస చేయాలి. ఐదో రోజు కుమారకోమ్ లేదా అలెప్పీ బయల్దేరాలి. హౌజ్‌బోట్‌లో చెకిన్ కావాలి. బ్యాక్‌వాటర్స్ మీదుగా క్రూజ్ ప్రయాణిస్తుంది. రాత్రికి హౌజ్‌బోట్‌లోనే బస చేయాలి. ఆరో రోజు కొచ్చిన్ టూర్ ఉంటుంది. లులు మాల్ సందర్శించవచ్చు. ఆ తర్వాత పర్యాటకుల్ని ఎర్నాకుళం రైల్వే స్టేషన్ లేదా కొచ్చిన్ ఎయిర్ పోర్టులో డ్రాప్ చేయడంతో టూర్ ముగుస్తుంది.
Indane Gas: ఇండేన్ గ్యాస్ కనెక్షన్ ఉందా? ఎక్స్‌ట్రా సిలిండర్ తీసుకోండిలా
ఐఆర్‌సీటీసీ కేరళ టూర్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.9,475, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.21,990 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, హోటల్‌లో బస, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IRCTC, IRCTC Tourism, Kerala