తమిళనాడులోని ఆలయాలను సందర్శించాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. వారం రోజుల్లో తమిళనాడులోని ఆలయాలను చూపించనుంది. తమిళనాడులో గొప్ప రాజవంశాలైన పల్లవులు, చోళులు, పాండ్యులు నిర్మించిన చారిత్రక దేవాలయాలు ఉన్నాయి. కాంచీపురం నుంచి శ్రీరంగం వరకు ఉన్న వివిధ దేవాలయాల దైవత్వం, సంస్కృతిని చూడాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ అందిస్తోంది. టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు (Temples of Tamil Nadu) పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
ఐఆర్‌సీటీసీ టూరిజం టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు టూర్ ప్యాకేజీ 2023 ఫిబ్రవరి 5న ప్రారంభం అవుతుంది. ఇది 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో కాంచీపురం, కుంబకోణం, చెన్నై, పుదుచ్చేరి , తంజావూరు, తిరుచ్చి లాంటి ప్రాంతాలన్నీ కవర్ అవుతాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ ఆలయాలను ఈ టూర్‌లో చూడొచ్చు.
IRCTC Bharat Gaurav Trains: సికింద్రాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ భారత్ గౌరవ్ రైళ్లు... మరిన్ని రూట్స్‌లో కూడా టూరిస్ట్ ట్రైన్స్
Explore the historical temples of great dynasties of Pallavas, Cholas, Pandians, etc with IRCTC's tour package starting from ₹29750/- onwards. For details, visit https://t.co/gCnp9xTq40@AmritMahotsav @incredibleindia @tourismgoi #AzadiKiRail
— IRCTC (@IRCTCofficial) December 15, 2022
ఐఆర్‌సీటీసీ టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు ప్యాకేజీ వివరాలివే
ఐఆర్‌సీటీసీ టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు టూర్ ప్యాకేజీ 2023 ఫిబ్రవరి 5న హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 8.10 గంటలకు చెన్నై చేరుకుంటారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత మహాబలిపురం తీసుకెళ్తారు. మహాబలిపురం టూర్ ముగిసిన తర్వాత రాత్రికి చెన్నైలో బస చేయాలి.
రెండో రోజు చెన్నై నుంచి కాంచీపురం బయల్దేరాలి. కంచి కామాక్షి ఆలయాన్ని సందర్శించవచ్చు. మధ్యాహ్నం తిరువన్నమలై బయల్దేరాలి. అక్కడ దర్శనం తర్వాత అరుణాచలం బయల్దేరాలి. అరుణాచల శివుడిని దర్శించుకున్న తర్వాత పుదుచ్చెరి బయల్దేరాలి. రాత్రికి పుదుచ్చెరిలో బస చేయాలి.
IRCTC Ticket Booking: వాయిస్ మెసేజ్‌తో ట్రైన్ టికెట్ బుకింగ్... స్టెప్స్ ఇవే
మూడో రోజు ఆరోవిల్లె, అరబిందో ఆశ్రమం, ప్యారడైస్ బీచ్ సందర్శన ఉంటుంది. రాత్రికి పుదుచ్చెరిలో బస చేయాలి. నాలుగో రోజు చిదంబరం బయల్దేరాలి. నటరాజ స్వామి ఆళయం, గంగైకొండ చోళాపురం సందర్శన ఉంటుంది. సాయంత్రం కుంబకోణం బయల్దేరాలి. రాత్రికి కుంబకోణంలో బస చేయాలి.
ఐదో రోజు కుంబకోణంలోని ఆలయాల సందర్శన ఉంటుంది. రాత్రికి కుంబకోణంలో బస చేయాలి. ఆరో రోజు తంజావూర్ బయల్దేరాలి. బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. ఆ తర్వాత తిరుచ్చి బయల్దేరాలి. మధ్యాహ్నం శ్రీరంగం ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి తిరుచ్చిలో బస చేయాలి. ఏడో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. తిరుచ్చిలో ఉదయం 9.40 గంటలకు బయల్దేరితే ఉదయం 11.10 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్‌సీటీసీ టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.29,750, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.31,000, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.37,500 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IRCTC, IRCTC Tourism, Tamil nadu, Tourism, Travel