హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Cruise Tour: కేరళ వెళ్తున్నారా? ఐఆర్‌సీటీసీ క్రూజ్ టూర్ ప్యాకేజీ మీకోసమే

IRCTC Cruise Tour: కేరళ వెళ్తున్నారా? ఐఆర్‌సీటీసీ క్రూజ్ టూర్ ప్యాకేజీ మీకోసమే

IRCTC Cruise Tour: కేరళ వెళ్తున్నారా? ఐఆర్‌సీటీసీ క్రూజ్ టూర్ ప్యాకేజీ మీకోసమే
(image: ARC)

IRCTC Cruise Tour: కేరళ వెళ్తున్నారా? ఐఆర్‌సీటీసీ క్రూజ్ టూర్ ప్యాకేజీ మీకోసమే (image: ARC)

IRCTC Cruise Tour | క్రూజ్ టూర్ ఎంజాయ్ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం క్రూజ్ టూర్ ప్యాకేజీ (Cruise Tour Package) ప్రకటించింది. రెండు రోజుల పాటు క్రూజ్‌లో ఎంజాయ్ చేయొచ్చు.

కేరళ వెళ్లే పర్యాటకులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) క్రూజ్ టూర్ ప్రకటించింది. ఐఆర్‌సీటీసీ టూరిజం 'ఆర్‌వీ వైకుండం క్రూజ్ ప్యాకేజీ' పేరుతో ఈ క్రూజ్ టూర్ ప్యాకేజీ (Cruise Tour Package) ఆపరేట్ చేస్తోంది. కేరళ వెళ్లే పర్యాటకులు క్రూజ్ టూర్ ప్యాకేజీ బుక్ చేయొచ్చు. తొట్టప్పల్లి జెట్టి, అలెప్పీ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. 2022 నవంబర్ 30న, 2023 జనవరి 18న, మార్చి 29న ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీ బుక్ చేసిన పర్యాటకులు కేరళలోని తొట్టపల్లి, కురమడి, కంజిప్పొడం, పున్నామడలోని ప్రకృతి అందాలను చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో తెలుసుకోండి.

ఐఆర్‌సీటీసీ టూరిజం 'ఆర్‌వీ వైకుండం క్రూజ్ ప్యాకేజీ' మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. పర్యాటకులు తొట్టప్పల్లి జెట్టి, అలెప్పీలో క్రూజ్ ఎక్కొచ్చు. కేరళలోని ప్రకృతి అందాలు, నదులు, మడుగులు, కాల్వలు, తీర ప్రాంతాల్లోని ముఖద్వారాలను చూడొచ్చు. విశాలమైన వరి పొలాలు, ఊగుతున్న ఎత్తైన కొబ్బరి చెట్లు, అరటి తోటలు, దారి పొడవునా పచ్చదనం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకోవడం ఖాయం. క్రూజ్‌లోనే సాంప్రదాయ మధ్యాహ్న భోజనాన్ని ఆస్వాదించవచ్చు. ఓవైపు గ్రామీణ వాతావరణాన్ని చూస్తూ రిలాక్స్ కావొచ్చు.

IRCTC Tirupati Tour: విశాఖపట్నం నుంచి ఫ్లైట్‌లో తిరుపతి టూర్... 3 రోజుల ప్యాకేజీ వివరాలివే

రెండో రోజు కూడా క్రూజ్ ప్రయాణం ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సర్పాలను పూజించే పవిత్రమైన క్షేత్రాన్ని సందర్శించవచ్చు. ఈ ఆలయంలో మహిళా పూజారులు ఉంటారు. ఆ తర్వాత మన్నార్ గ్రామానికి వెళ్లాలి. అక్కడ దేవాలయాలలో ఉపయోగించే సాంప్రదాయ దీపాలు, అలంకరించబడిన తాళాలు, గంటలు, వివిధ రకాల పాత్రల తయారీ చూడొచ్చు. సెయింట్ థామస్ చర్చిల్లో ఒకదానిని సందర్శించవచ్చు. ఆ తర్వా కారుమడి గ్రామానికి వెళ్లాలి. బుద్ధుని మందిరం సందర్శించిన తర్వాత కంజిప్పొడం గ్రామానికి నడక మార్గంలో వెళ్లొచ్చు. రాత్రికి తిరిగి క్రూజ్‌కు చేరుకోవాలి. రాత్రంతా క్రూజ్ ప్రయాణం ఉంటుంది.

మూడో రోజు ఉదయం 10 గంటలకు IWAI జెట్టి, పున్నామడ, అలెప్పీలో క్రూజ్ దిగాలి. పున్నామడ సరస్సు దగ్గర బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. ఆ తర్వాత అలెప్పీలోని వేర్వేరు గ్రామాల నుంచి వచ్చిన స్నేక్ బోట్స్ రేస్ చూడొచ్చు. ఆ తర్వాత అలెప్పీలో మార్కెట్ సందర్శించవచ్చు. ఇక్కడితో టూర్ ముగుస్తుంది.

IRCTC Shirdi Tour: ఫ్లైట్‌లో షిర్డీ టూర్... హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ

ఐఆర్‌సీటీసీ టూరిజం 'ఆర్‌వీ వైకుండం క్రూజ్ ప్యాకేజీ' ధర వివరాలు చూస్తే సుపీరియర్ క్యాబిన్‌లో ట్విన్ ఆక్యుపెన్సీకి ఒకరికి రూ.25,200, సింగిల్ ఆక్యుపెన్సీకి ఒకరికి రూ.44,100, డీలక్స్ క్యాబిన్‌లో ట్విన్ ఆక్యుపెన్సీకి ఒకరికి రూ.37,800, సింగిల్ ఆక్యుపెన్సీకి ఒకరికి రూ.66,150 చొప్పున చెల్లించాలి. పిల్లలకు కూడా ఛార్జీలు ఉన్నాయి. 2022 సెప్టెంబర్ 30 లోగా బుక్ చేసేవారికి ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ క్రూజ్ ప్యాకేజీలో కొచ్చి-అలెప్పీ మధ్య ఎయిర్‌పోర్ట్ ట్రాన్స్‌ఫర్, ఏసీ అకామడేషన్, మొదటి రోజు లంచ్, డిన్నర్ స్నాక్స్, రెండో రోజు మీల్స్, స్నాక్స్, మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ లాంటివి కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీ కేరళలో అందుబాటులో ఉంది. ఇతర ప్రాంతాల నుంచి కేరళ వెళ్లే పర్యాటకులు క్రూజ్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: IRCTC, IRCTC Tourism, Kerala

ఉత్తమ కథలు