IRCTC TOURISM ANNOUNCED VIBRANT GUJARAT TOUR PACKAGE FROM VIJAYAWADA RAJAHMUNDRY VISAKHAPATNAM KNOW PACKAGE DETAILS SS
IRCTC Tour: రూ.11 వేల లోపే 11 రోజుల టూర్... విజయవాడ, విశాఖపట్నం నుంచి గుజరాత్‌కు...
IRCTC Tour: రూ.11 వేల లోపే 11 రోజుల టూర్... విజయవాడ, విశాఖపట్నం నుంచి గుజరాత్‌కు...
(ప్రతీకాత్మక చిత్రం)
IRCTC Vibrant Gujarat Tour | ఐఆర్సీటీసీ వైబ్రంట్ గుజరాత్ పేరుతో విజయవాడ, విశాఖపట్నం నుంచి టూర్ ప్రకటించింది. కేవలం రూ.11 వేల లోపే 11 రోజుల టూర్ కవర్ చేయొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.
కొత్త సంవత్సరంలో టూర్లకు వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) తక్కువ ధరకే టూర్ ప్యాకేజీ ప్రకటించింది. విజయవాడ, విశాఖపట్నం నుంచి గుజరాత్‌కు టూర్ ప్రకటించింది. కేవలం రూ.10,400 ప్యాకేజీతో 11 రోజుల టూర్‌కు తీసుకెళ్తోంది ఐఆర్సీటీసీ. వైబ్రంట్ గుజరాత్ (Vibrant Gujarat) పేరుతో ప్రకటించిన టూర్ ప్యాకేజీలో సోమనాథ్, ద్వారక, నాగేశ్వర్, బెట్ ద్వారక, అహ్మదాబాద్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ టూర్ 2022 జనవరి 21న ప్రారంభం అవుతుంది. 2022 జనవరి 31న ముగుస్తుంది.
IRCTC Vibrant Gujarat Tour: ఐఆర్సీటీసీ వైబ్రంట్ గుజరాత్ టూర్ సాగేది ఇలాగే
ఐఆర్సీటీసీ వైబ్రంట్ గుజరాత్ టూర్లో భాగంగా మొదటి రోజు పర్యాటకులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్, పలాసలో రైలు ఎక్కాలి. రెండో రోజు, మూడో రోజు మొత్తం రైలు ప్రయాణమే ఉంటుంది. నాలుగో రోజు సోమనాథ్ చేరుకుంటారు. అక్కడ సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత ద్వారక బయల్దేరాలి.
ఐదో రోజు ద్వారక చేరుకుంటారు. అక్కడ ద్వారాకాదీశ్ ఆలయంతో పాటు ఇతర ఆలయాల సందర్శన ఉంటుంది. రాత్రికి ద్వారకలో బస చేయాలి. ఆరో రోజు బెట్ ద్వారక, నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత వాత్వ బయల్దేరాలి. ఏడో రోజు వాత్వ చేరుకుంటారు. అక్కడ సబర్మతీ ఆశ్రమం, అక్షరధామ్ ఆలయం సందర్శన ఉంటుంది. రాత్రికి వాత్వలో బస చేయాలి.
ఎనిమిదో రోజు ఆ తర్వాత విశ్వామిత్ర్కు బయల్దేరాలి. విశ్వామిత్ర రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి తీసుకెళ్తారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూసిన తర్వాత అదే రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. తొమ్మిదో రోజు, పదో రోజు రైలు ప్రయాణం ఉంటుంది. పదకొండో రోజు పర్యాటకులు పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ రైల్వే స్టేషన్లకు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ వైబ్రంట్ గుజరాత్ టూర్ ప్యాకేజీ ధర చూస్తే స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.10,400 కాగా, కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.17,330. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ ప్రయాణం, నాన్ ఏసీ గదుల్లో బస, టీ, కాఫీ, శాకాహార భోజనం, రోజూ 1 లీటర్ డ్రింకింగ్ వాటర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఆలయాలు, ఇతర పర్యాటక ప్రాంతాల్లో ఎంట్రెన్స్ ఫీజులు ఇందులో కవర్ కావు. పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.