బ్యాంకాక్... ట్రావెలింగ్ అంటే ఇష్టపడేవారి డ్రీమ్ డెస్టినేషన్. ఒక్కసారైనా థాయ్‌ల్యాండ్ వెళ్లి బ్యాంకాక్, పట్టాయా లాంటి పర్యాటక ప్రాంతాలు చూసిరావాలని అనుకుంటారు. వారికి ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి థాయ్‌ల్యాండ్ టూర్ ప్రకటించింది. ట్రెజర్స్ ఆఫ్ థాయ్‌ల్యాండ్ (Treasures of Thailand) పేరుతో టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. పర్యాటకుల్ని ఫ్లైట్‌లో థాయ్‌ల్యాండ్ తీసుకెళ్లి అక్కడి పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. ఈ ప్యాకేజీలో బ్యాంకాక్, పట్టాయా కవర్ అవుతాయి. 2022 ఆగస్ట్ 12న టూర్ ప్రారంభం అవుతుంది. మరి ఈ టూర్ ఎలా సాగుతుందో తెలుసుకోండి.
ఐఆర్‌సీటీసీ టూరిజం ట్రెజర్స్ ఆఫ్ థాయ్‌ల్యాండ్ టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. అర్థరాత్రి 1.10 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే తెల్లవారుజామున 6.15 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటారు. ఎయిర్‌పోర్టులో ఫార్మాలిటీస్ పూర్తైన తర్వాత పట్టాయా బయల్దేరాలి. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత మధ్యాహ్నం వరకు రిలాక్స్ కావొచ్చు. లంచ్ తర్వాత పట్టాయలోని జెమ్స్ గ్యాలరీ సందర్శన ఉంటుంది. సాయంత్రం అల్కజార్ షో చూడొచ్చు. రాత్రికి ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ ఉంటుంది. రాత్రికి పట్టాయాలో బస చేయాలి.
IRCTC Kashmir Tour: హౌజ్ బోట్‌లో అకామడేషన్‌తో కాశ్మీర్ టూర్... హైదరాబాద్ నుంచి ప్యాకేజీ
రెండో రోజు ఉదయం కోరల్ ఐల్యాండ్ టూర్ పయల్దేరాలి. నాంగ్ నూచ్ ట్రోపికల్ గార్డెన్ సందర్శన ఉంటుంది. రాత్రికి ఇండియన్ రెస్టారెంట్‌లో భోజనం చేసిన తర్వాత పట్టాయాలో బస చేయాలి. మూడో రోజు బ్యాంకాక్ సిటీకి బయల్దేరాలి. లంచ్ తర్వాత గోల్డెన్ బుద్ధ ఆలయం, ఇతర ప్రాంతాలు సందర్శించవచ్చు. రాత్రికి బ్యాంకాక్‌లో బస చేయాలి. నాలుగో రోజు హోటల్ నుంచి చెకౌట్ అయిన తర్వాత సఫారీ వాల్డ్ టూర్, మెరైన్ పార్క్ సందర్శన ఉంటాయి. అదే రోజు రాత్రి 10.10 గంటలకు బ్యాంకాక్‌లో బయల్దేరితే అర్ధరాత్రి 12.10 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
Post Office Scheme: రిటైర్మెంట్ నాటికి కోటి రూపాయలు... ఈ స్కీమ్‌లో మీరూ చేరండి
ఐఆర్‌సీటీసీ టూరిజం ట్రెజర్స్ ఆఫ్ థాయ్‌ల్యాండ్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే సింగిల్ షేరింగ్‌కు రూ.55,640, డబుల్ షేరింగ్‌కు రూ.48,820, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.48,820 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangkok, IRCTC, IRCTC Tourism, Thailand, Tourism, Travel