హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Tour: హైదరాబాద్ నుంచి కొడైకెనాల్, రామేశ్వరం టూర్... ప్యాకేజీ వివరాలివే

IRCTC Tour: హైదరాబాద్ నుంచి కొడైకెనాల్, రామేశ్వరం టూర్... ప్యాకేజీ వివరాలివే

IRCTC Tour | ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి 'ట్రెజర్స్ ఆఫ్ తమిళనాడు' (Treasures of Tamil Nadu) టూర్ ప్యాకేజీ ప్రకటించింది. మదురై, కొడైకెనాల్, రామేశ్వరం, శ్రీరంగం, తంజావూర్, తిరుచ్చి ప్రాంతాలు చూడొచ్చు. టూర్ ప్యాకేజీ వివరాలివే.

ఇంకా చదవండి ...

  సమ్మర్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తూ వేర్వేరు ప్రాంతాల నుంచి వరుసగా టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీలను (Tour Package) ఆపరేటిస్తోంది. తాజాగా హైదరాబాద్ నుంచి తమిళనాడు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. కొయంబత్తూర్, మదురై, కొడైకెనాల్, రామేశ్వరం, శ్రీరంగం, తంజావూర్, తిరుచ్చి ప్రాంతాలను కవర్ చేస్తూ 'ట్రెజర్స్ ఆఫ్ తమిళనాడు' టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఇది 5రాత్రులు, 6రోజుల టూర్ ప్యాకేజీ. మే 8న టూర్ ప్రారంభమై మే13న ముగుస్తుంది. ఐఆర్‌సీటీసీ టూరిజం టూరిస్టుల్ని ఫ్లైట్‌లో తీసుకెళ్లి తమిళనాడులోని పర్యాటక ప్రాంతాలను చూపిస్తుంది. ఐఆర్‌సీటీసీ టూరిజం 'ట్రెజర్స్ ఆఫ్ తమిళనాడు' టూర్ ఎలా సాగుతుందో తెలుసుకోండి.

  టూర్ ప్యాకేజీ వివరాలివే

  ఐఆర్‌సీటీసీ టూరిజం 'ట్రెజర్స్ ఆఫ్ తమిళనాడు' టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. ఉదయం 10.20 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే 11.50 గంటలకు మదురై చేరుకుంటారు. మీనాక్షి ఆలయ సందర్శన తర్వాత రామేశ్వరం బయల్దేరాలి. రాత్రికి రామేశ్వరంలో బస చేయాలి. రెండో రోజు ఉదయం సొంత ఖర్చులతో ధనుష్కోడికి బయల్దేరాలి. రామనథస్వామి ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. ఆ తర్వాత కలాం మెమొరియల్ సందర్శన ఉంటుంది. రాత్రికి రామేశ్వరంలో బస చేయాలి.

  IRCTC Coorg Tour: హైదరాబాద్ టు కూర్గ్... రూ.10,000 లోపే ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ

  మూడో రోజు ఉదయం తంజావూర్ బయల్దేరాలి. బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించాలి. ఆ తర్వాత తిరుచ్చి బయల్దేరాలి. రాత్రికి తిరుచ్చిలో బస చేయాలి. నాలుగో రోజు ఉధయం శ్రీరంగం ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత కొడైకెనాల్ బయల్దేరాలి. రాత్రికి కొడైకెనాల్‌లోనే బస చేయాలి. ఐదో రోజు కొడైకెనాల్ లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. రాత్రికి కొడైకెనాల్‌లో బస చేయాలి. ఆరో రోజు ఉదయం పళని బయల్దేరాలి. పళని ఆలయాన్ని సందర్శించిన తర్వాత కొయంబత్తూర్‌కు బయల్దేరాలి. కొయంబత్తూర్ ఎయిర్‌పోర్టులో రాత్రి 8.05 గంటలకు ఫ్లైట్ ఎక్కితే రాత్రి 9.45 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

  IRCTC Shimla Tour: సమ్మర్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి షిమ్లా ప్యాకేజీ

  టూర్ ప్యాకేజీ ధర ఎంతంటే

  ఐఆర్‌సీటీసీ టూరిజం 'ట్రెజర్స్ ఆఫ్ తమిళనాడు' టూర్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.26,750 కాగా, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.28,450. ఇక సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.39,250 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్ ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి. ఆలయాలు, సైట్‌సీయింగ్ ప్రాంతాల్లో ఎంట్రెన్స్ టికెట్లు, లంచ్, హైదరాబాద్ లోకల్ ట్రాన్స్‌పోర్ట్, ఫ్లైట్‌లో మీల్స్ లాంటివి కవర్ కావు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు.

  First published:

  Tags: IRCTC, IRCTC Tourism, Tourism, Travel

  ఉత్తమ కథలు