ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన టూరిజం సంస్థ ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) తిరుపతి లోకల్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. తిరుమలకు (Tirumala Tour) వెళ్లే భక్తులు శ్రీవారి దర్శనంతో పాటు సమీపంలో ఉన్న ఇతర ఆలయాలను కూడా సందర్శిస్తుంటారు. వారిని దృష్టిలో పెట్టుకొని లోకల్ టూర్ ప్యాకేజీలను (Tirupati Local Tour Packages) ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలను సందర్శించేందుకు ఇప్పటికే ఓ ప్యాకేజీ ప్రకటించింది. ఆ ప్యాకేజీ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు కార్వేటినగరం, నగరి, తిరుమల, తిరుచానూర్ ప్రాంతాలను కవర్ చేస్తూ 'తిరుపతి మోక్షం' పేరుతో మరో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. 1 రాత్రి, 2 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. మరి ఈ టూర్ ఎలా సాగుతుందో తెలుసుకోండి.
భక్తుల్ని మొదటి రోజు తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఐఆర్‌సీటీసీ సిబ్బంది రిసీవ్ చేసుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత కార్వేటినగరం తీసుకెళ్తారు. అక్కడ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. ఆ తర్వాత నగరిలో కరియా మాణిక్య స్వామి ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత కోదండరామ ఆలయం, ఇస్కాన్ ఆలయాలను సందర్శించుకోవాలి. రాత్రికి తిరుపతిలోనే బస చేయాలి.
IRCTC Kashmir Tour: హైదరాబాద్ టు కాశ్మీర్ టూర్... హౌజ్ బోట్‌లో అకామడేషన్... ప్యాకేజీ వివరాలివే
Fly to the sacred temples of #Tirupati with our most-affordable, all-incl. 'Tirupati Moksham' air tour package starting at Rs.4740/-pp* only. #Booking and #details on https://t.co/beuEEBvB5F. *T&C Apply@AmritMahotsav
— IRCTC (@IRCTCofficial) February 22, 2022
రెండో రోజు ఉదయం తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం ఉంటుంది. శ్రీవారి దర్శనం తర్వాత తిరుచానూరులో శ్రీ పద్మావతి ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. పర్యాటకుల్ని సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేయడంతో టూర్ ముగుస్తుంది. ఐఆర్‌సీటీసీ టూరిజం తిరుపతి మోక్షం టూర్ ప్యాకేజీ తిరుపతి నుంచి ప్రారంభం అవుతుందన్న విషయాన్ని పర్యాటకులు గుర్తుంచుకోవాలి. తిరుపతి చేరుకున్న తర్వాత తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర ఆలయాలను సందర్శించాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది.
IRCTC Govindam Tour: శ్రీవారి ప్రత్యేక దర్శనంతో తిరుమల టూర్... రూ.4,000 లోపే ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ
ఐఆర్‌సీటీసీ టూరిజం తిరుపతి మోక్షం టూర్ ప్యాకేజీ ధర చూస్తే 1 నుంచి 3 పర్యాటకులు బుక్ చేస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4,740, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6,470, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.12,410 చెల్లించాలి. ఇక 4 నుంచి 6 పర్యాటకులు బుక్ చేస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4,570, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4,710 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో తిరుపతిలో బస, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం, ఇతర ఆలయాల్లో సాధారణ దర్శనం, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.