IRCTC TOURISM ANNOUNCED TIRUPATI BALAJI DARSHANAM TOUR PACKAGE FROM VISAKHAPATNAM KNOW PACKAGE DETAILS SS
IRCTC Tirupati Tour: విశాఖపట్నం నుంచి తిరుపతి టూర్... ప్యాకేజీ వివరాలివే
IRCTC Tirupati Tour: విశాఖపట్నం నుంచి తిరుపతి టూర్... ప్యాకేజీ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)
IRCTC Tirupati Tour | ఐఆర్‌సీటీసీ టూరిజం తిరుపతికి మరో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. తిరుపతి బాలాజీ దర్శనం (Tirupati Balaji Darshanam) పేరుతో వైజాగ్ నుంచి టూర్ ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.
విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లాలనుకునే శ్రీవారి భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Toursim) విశాఖపట్నం నుంచి తిరుపతికి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. తిరుపతి బాలాజీ దర్శనం (Tirupati Balaji Darshanam) పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న ప్రయాణికుల్ని ఫ్లైట్‌లో తీసుకెళ్లనుంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుచానూర్, తిరుపతి కవర్ అవుతాయి. 2022 మే 13, 27 తేదీల్లో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. మూడు రోజుల్లో తిరుమలతో పాటు చుట్టుపక్కన ఉన్న ఆలయాలను సందర్శించాలనుకునేవారికి ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది.
టూర్ సాగేది ఇలాగే
ఐఆర్‌సీటీసీ టూరిజం తిరుపతి బాలాజీ దర్శనం టూర్ ప్యాకేజీ మొదటి రోజు విశాఖపట్నంలో ప్రారంభం అవుతుంది. ఉదయం 06:25 గంటలకు విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 08:25 గంటలకు తిరుపతి చేరుకుంటారు. హోటల్‌లో ఫ్రెషప్ అయిన తర్వాత కాణిపాకం, శ్రీనివాస మంగాపురం ఆలయాలను సందర్శించొచ్చు. రాత్రికి తిరుపతిలోనే బస చేయాలి.
రెండో రోజు ఉదయం తిరుమలకు బయల్దేరాలి. తిరుమలలో దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాల సందర్శన ఉంటుంది. రాత్రికి తిరుపతిలో బస చేయాలి. మూడో రోజు ఉదయం 08:45 గంటలకు తిరుపతిలో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 10:25 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధర ఎంతంటే
ఐఆర్‌సీటీసీ టూరిజం తిరుపతి బాలాజీ దర్శనం టూర్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.13,235 కాగా, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.13,430. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.16,800 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, తిరుపతిలో హోటల్ అకాడమడేషన్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్‌సీయింగ్, తిరుమల, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురంలో దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. హైదరాబాద్‌లో లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్, బ్రేక్‌ఫాస్ట్, ఫ్లైట్‌లో మీల్స్ లాంటివి ఈ టూర్ ప్యాకేజీలో కవర్ కావు.
ఐఆర్‌సీటీసీ టూరిజం విశాఖపట్నం నుంచి మాత్రమే కాదు హైదరాబాద్, విజయవాడ, కరీంనగర్ లాంటి ప్రాంతాల నుంచి తిరుపతి ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. తిరుపతితో పాటు దేశంలోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాలకు వేర్వేరు టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.