Home /News /business /

IRCTC TOURISM ANNOUNCED TIRUPATI BALAJI DARSHANAM FLIGHT TOUR PACKAGE FROM VISAKHAPATNAM KNOW PACKAGE DETAILS SS

IRCTC Tirupati Tour: విశాఖపట్నం నుంచి ఫ్లైట్‌లో తిరుపతి టూర్... 3 రోజుల ప్యాకేజీ వివరాలివే

IRCTC Tirupati Tour: విశాఖపట్నం నుంచి ఫ్లైట్‌లో తిరుపతి టూర్... 3 రోజుల ప్యాకేజీ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Tirupati Tour: విశాఖపట్నం నుంచి ఫ్లైట్‌లో తిరుపతి టూర్... 3 రోజుల ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Tirupati Tour | ఐఆర్‌సీటీసీ టూరిజం విశాఖపట్నం నుంచి తిరుపతికి 3 రోజుల ప్యాకేజీ ప్రకటించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుచానూర్‌లోని ఆలయాలు ఈ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి.

విశాఖపట్నం నుంచి తిరుపతికి (Visakhapatnam to Tirupati) వెళ్లాలనుకునే శ్రీవారి భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) వైజాగ్ నుంచి తిరుపతికి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. తిరుపతి బాలాజీ దర్శనం (Tirupati Balaji Darshanam) పేరుతో టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుచానూర్‌లోని ఆలయాలు కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీ జూలై 29, ఆగస్ట్ 12, ఆగస్ట్ 26, సెప్టెంబర్ 9, అక్టోబర్ 7, అక్టోబర్ 21, నవంబర్ 25, డిసెంబర్ 18 తేదీల్లో అందుబాటులో ఉంది. తిరుపతి టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

తిరుపతి టూర్ ప్యాకేజీ వివరాలివే...


ఐఆర్‌సీటీసీ టూరిజం తిరుపతి బాలాజీ దర్శనం టూర్ మొదటిరోజు విశాఖపట్నంలో ప్రారంభం అవుతుంది. ఉదయం 6.25 గంటలకు విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే 6.25 గంటలకు తిరుపతి చేరుకుంటారు. హోటల్‌లో ఫ్రెష్ అప్ అయిన తర్వాత లంచ్ వరకు రెస్ట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత కాణిపాకం, శ్రీనివాస మంగాపురం ఆలయాల దర్శనం ఉంటుంది. రాత్రికి తిరుపతిలోనే బస చేయాలి.

IRCTC Shirdi Tour: ఫ్లైట్‌లో షిర్డీ టూర్... హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ

రెండో రోజు ఉదయం తిరుమల బయల్దేరాలి. శ్రీవారి దర్శనం తర్వాత లంచ్ చేయాలి. ఆ తర్వాత శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాల దర్శనం ఉంటుంది. రాత్రికి తిరుపతిలోనే బస చేయాలి. మూడో రోజు ఉదయం 8.45 గంటలకు తిరుపతిలో ఫ్లైట్ ఎక్కితే 10.25 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఐఆర్‌సీటీసీ టూరిజం తిరుపతి బాలాజీ దర్శనం టూర్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.14,920, డబ్లు ఆక్యుపెన్సీకి రూ.15,110, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.18,485 చెల్లించాలి. రెండేళ్ల లోపు పిల్లలకు వన్ వేలో రూ.1,500 చొప్పున చెల్లించాలి. ఎయిర్‌పోర్ట్ కౌంటర్లలో నేరుగా చెల్లించాల్సి ఉంటుంది.

IRCTC Thailand Tour: బ్యాంకాక్ వెళ్తారా? థాయ్‌ల్యాండ్ టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ



టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, తిరుపతిలో రెండు రాత్రులు అకామడేషన్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమల, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురంలో దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి. పురుషులు ధోతి, షర్ట్, కుర్తా, పైజామా ధరించాలి. మహిళలు చీర లేదా సల్వార్ కమీజ్ ధరించాలి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: IRCTC, IRCTC Tourism, Tirumala, Tirupati

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు