IRCTC TOURISM ANNOUNCED THEERTHAM TIRUPATI TOUR PACKAGE INCLUDES SPECIAL ENTRY DARSHNAM AT TIRUMALA AND COVERS NARAYANAVANAM NAGALAPURAM APPALAYAGUNTA TIRUCHANAURU SS
IRCTC Tirupati Tour: తిరుపతి సమీపంలో ఈ ఆలయాలను చూశారా? ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ
IRCTC Tirupati Tour: తిరుపతి సమీపంలో ఈ ఆలయాలను చూశారా? ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ
(ప్రతీకాత్మక చిత్రం)
IRCTC Tirupati Tour | తిరుమల టూర్ ప్లాన్ చేశారా? తిరుపతి సమీపంలో ఆలయాలను సందర్శించాలనుకుంటున్నారా? ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులు వెంకటేశ్వరస్వామి దర్శనం తర్వాత తిరుపతి (Tirupati) సమీపంలో ఉన్న ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, కాణిపాకంలో (Kanipakam) వినాయక ఆలయం, శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శిస్తుంటారు. అయితే ఇవే కాకుండా తిరుపతి సమీపంలో మరిన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. తిరుపతి సమీపంలో నారాయణవణం, నాగాలపురం, అప్పలయ్యగుంటలో కూడా ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలను కవర్ చేస్తూ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) 'తీర్థం తిరుపతి' పేరుతో టూర్ ప్యాకేజీ ప్రకటించింది.
ఐఆర్సీటీసీ టూరిజం 'తీర్థం తిరుపతి' ప్యాకేజీ వివరాలు ఇవే...
ఐఆర్సీటీసీ టూరిజం 'తీర్థం తిరుపతి' ప్యాకేజీలో తిరుపతి, నారాయణవణం, నాగాలపురం, అప్పలయ్యగుంట, తిరుమల, తిరుచానూర్ ఆలయాలు కవర్ అవుతాయి. ఇది ఒక రాత్రి, రెండు రోజుల టూర్ ప్యాకేజీ. తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు ఇతర ఆలయాల సందర్శన కవర్ అవుతుంది. తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు ఇతర ఆలయాలు సందర్శించాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది.
Experience the legend come alive with our well-planned, all-incl. 2D/1N religious tour package starting at Rs. 4740/-pp* only. #Book today for your entire family, only on https://t.co/7v3gwqTcvI. *T&C Apply@AmritMahotsav
ఐఆర్సీటీసీ టూరిజం 'తీర్థం తిరుపతి' ప్యాకేజీ మొదటి రోజు తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రారంభం అవుతుంది. భక్తులు హోటల్లో ఫ్రెషప్ అయిన తర్వాత నారాయణవణానికి బయల్దేరాలి. అక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం సందర్శించిన తర్వాత నాగాలపురం బయల్దేరాలి. అక్కడ వేదనారాయణ ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత అప్పలయ్యగుంటకు భక్తుల్ని తీసుకెళ్తారు. అక్కడ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత శ్రీనివాస మంగాపురం, కపిల తీర్థం సందర్శించొచ్చు. రాత్రికి తిరుపతిలో బస చేయాలి.
రెండో రోజు ఉదయం హోటల్ నుంచి చెకౌట్ అయిన తర్వాత తిరుమల ఆలయానికి తీసుకెళ్తారు. తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. దర్శనం పూర్తైన తర్వాత తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి ఆలయ సందర్శన ఉంటుంది. రెండో రోజు సాయంత్రం భక్తుల్ని తిరుపతి రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ టూరిజం 'తీర్థం తిరుపతి' ప్యాకేజీ ధర చూస్తే ఒకరి నుంచి ముగ్గురు ఈ ప్యాకేజీ బుక్ చేస్తే ఒకరికి ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4,740, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6,470, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.12,410 చెల్లించాలి. నలుగురి నుంచి ఆరుగురు ఈ ప్యాకేజీ బుక్ చేస్తే ఒకరికి డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4,710, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4,570 చెల్లించాలి.
ఈ టూర్ ప్యాకేజీలో తిరుపతిలో ఒక రోజు బస, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం, ఇతర ఆలయాల్లో సాధారణ దర్శనం, ఒక రోజు బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం అధికారిక వెబ్సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.