ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన టూరిజం విభాగం ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) దేశంలోని పర్యాటక ప్రాంతాలకు మాత్రమే కాదు, విదేశాల్లోని టూరిస్ట్ స్పాట్స్‌కి కూడా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. థాయ్‌ల్యాండ్ వెళ్లాలనుకునేవారి కోసం దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంటి టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. విశాఖపట్నం నుంచి థాయ్‌ల్యాండ్‌కు (Visakhapatnam to Thailand) 'ఫ్యాసినేటింగ్ థాయ్‌ల్యాండ్' పేరుతో ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో బ్యాంకాక్, పట్టాయా కవర్ అవుతాయి. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ. 2022 డిసెంబర్ 8న టూర్ ప్రారంభం అవుతుంది. వైజాగ్ నుంచి థాయ్‌ల్యాండ్ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.
ఐఆర్సీటీసీ థాయ్‌ల్యాండ్ టూర్ మొదటి రోజు ఉదయం విశాఖపట్నంలో మొదలవుతుంది. సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే అర్థరాత్రి 1.55 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటారు. అక్కడ్నుంచి పట్టాయా బయల్దేరాలి. రెండో రోజు మధ్యాహ్నం నాంగ్ నూచ్ గార్డెన్ టూర్ సందర్శన ఉంటుంది. సాయంత్రం అల్కజార్ షో చూడొచ్చు. రాత్రికి పట్టాయాలో బస చేయాలి.
IRCTC Ticket Booking: వాయిస్ మెసేజ్‌తో రైలు టికెట్ల బుకింగ్... ఎలా చేయాలో తెలుసుకోండి
Escape to a revitalizing experience in the “heavenly land of spas” or go shopping in one of Thailand’s upscale shopping malls, high street shops, bustling markets with IRCTC's Air tour package. Book on https://t.co/ZOKy1yZLel@AmritMahotsav #AzadiKiRail
— IRCTC (@IRCTCofficial) November 1, 2022
మూడో రోజు పట్టాయా సందర్శన ఉంటుంది. గల్ఫ్ ఆఫ్ థాయ్‌ల్యాండ్ మీదుగా కోరల్ ఐల్యాండ్ తీసుకెళ్తారు. మధ్యాహ్నం ఇండియన్ రెస్టారెంట్లో లంచ్ ఉంటుంది. సాయంత్రం ఖాళీ సమయం ఉంటుంది. రాత్రికి పట్టాయాలో బస చేయాలి. నాలుగో రోజు పట్టాయా నుంచి బ్యాంకాక్ వెళ్లాలి. బ్యాంకాక్ చేరుకున్న తర్వాత సఫారీ వాల్డ్ టూర్ ఉంటుంది. రాత్రికి బ్యాంకాక్‌లో బస చేయాలి.
ఐదో రోజు బ్యాంకాక్ హాఫ్ డే టూర్ ఉంటుంది. గోల్డెన్ బుద్ధ, మార్బుల్ బుద్ధ చూడొచ్చు. సాయంత్రం షాపింగ్ కోసం సమయం ఉంటుంది. రాత్రికి తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. బ్యాంకాక్‌లో అర్ధరాత్రి 2.55 గంటలకు బయల్దేరితే ఆరో రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
Dream Job: నెలకు రూ.3,50,000 జీతం... ఉచితంగా హెలికాప్టర్ రైడ్... అదిరిపోయే ఆఫర్
ఐఆర్సీటీసీ థాయ్‌ల్యాండ్ టూర్ ప్యాకేజీ ధర వివరాలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.54,999, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.54,999, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.63,310 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, పట్టాయాలో రెండు రాత్రులు, బ్యాంకాక్‌లో ఒక రాత్రి బస, బ్రేక్‌ఫాస్ట్, 2 రోజులు డిన్నర్, లంచ్, అల్కజార్ షో, స్పీడ్ బోట్లో కోరల్ ఐల్యాండ్, సఫారీ వాల్డ్, మెరైన్ పార్క్, హాఫ్ డే బ్యాంకాక్ టెంపుల్ సిటీ టూర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. పర్యాటకులు వీసా ఆన్ అరైవల్ కోసం ఒకరికి 2000 థాయ్ భట్ చెల్లించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IRCTC, IRCTC Tourism, Thailand, Visakhapatnam, Vizag