Home /News /business /

IRCTC TOURISM ANNOUNCED SOUTHERN DIVINE TEMPLE TOUR PACKAGE FROM VISAKHAPATNAM KNOW PACKAGE DETAILS SS

IRCTC South India Tour: విశాఖపట్నం నుంచి దక్షిణ భారతదేశ యాత్ర... 6 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే

IRCTC South India Tour: విశాఖపట్నం నుంచి దక్షిణ భారతదేశ యాత్ర... 6 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC South India Tour: విశాఖపట్నం నుంచి దక్షిణ భారతదేశ యాత్ర... 6 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC South India Tour | ఐఆర్‌సీటీసీ టూరిజం విశాఖపట్నం నుంచి దక్షిణ భారతదేశ యాత్ర ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో (IRCTC Tour Packages) రామేశ్వరం, మదురై, త్రివేండ్రం లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పర్యాటక స్థలాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు చూడాలనుకునే టూరిస్టులకు గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) విశాఖపట్నం నుంచి ఫ్లైట్‌లో సౌత్ ఇండియా టూర్ (South India Tour) ప్యాకేజీ ప్రకటించింది. 'సదరన్ డివైన్ టెంపుల్ టూర్' పేరుతో ఈ ప్యాకేజీ అందిస్తోంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీలో కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, త్రివేండ్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. 2022 ఆగస్ట్ 12న ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం కానుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఐఆర్‌సీటీసీ టూరిజం సౌత్ ఇండియా టూర్ ప్యాకేజీ వివరాలు చూస్తే టూర్ మొదటి రోజు విశాఖపట్నంలో ప్రారంభం అవుతుంది. ఉదయం 8.55 గంటలకు విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే 10.20 గంటలకు చెన్నై చేరుకుంటారు. చెన్నైలో మధ్యాహ్నం 12.50 గంటలకు ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 2.05 గంటలకు మదురై చేరుకుంటారు. సాయంత్రం మీనాక్షి అమ్మవారి దర్శనం ఉంటుంది. సమీపంలోని ఆలయాలను సందర్శించవచ్చు. రాత్రికి మదురైలో బస చేయాలి.

IRCTC Alert: ఐఆర్‌సీటీసీ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నవారికి అలర్ట్

రెండో రోజు ఉదయం రామేశ్వరం బయల్దేరాలి. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత ధనుష్కోడికి బయల్దేరాలి. సాయంత్రం తిరిగి రామేశ్వరం చేరుకోవాలి. రాత్రికి రామేశ్వరంలో బస చేయాలి. మూడో రోజు ఉదయం రామేశ్వరం సైట్‌సీయింగ్ ఉంటుంది. మధ్యాహ్నం కన్యాకుమారి బయల్దేరాలి. రాత్రికి కన్యాకుమారిలో బస చేయాలి.

నాలుగో రోజు తెల్లవారుజామున సన్‌రైస్ పాయింట్‌లో సూర్యోదయాన్ని చూడొచ్చు. ఆ తర్వాత కన్యాకుమారి సైట్ సీయింగ్ ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత త్రివేండ్రం బయల్దేరాలి. రాత్రికి త్రివేండ్రంలో బస చేయాలి. ఐదో రోజు త్రివేండ్రం సైట్ సీయింగ్ ఉంటుంది. ఆరో రోజు ఉదయం 7.25 గంటలకు త్రివేండ్రంలో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 8.45 గంటలకు చెన్నై చేరుకుంటారు. చెన్నైలో ఉదయం 10.35 గంటలకు ఫ్లైట్ ఎక్కితే ఉదయం 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

IRCTC Cruise Tour: కేరళ వెళ్తున్నారా? ఐఆర్‌సీటీసీ క్రూజ్ టూర్ ప్యాకేజీ మీకోసమే



ఐఆర్‌సీటీసీ టూరిజం సౌత్ ఇండియా టూర్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.32,350, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.33,770, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.43,330 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, ఏసీ హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: IRCTC, IRCTC Tourism, Tourism, Travel, Visakhapatnam

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు