IRCTC TOURISM ANNOUNCED SOUTH INDIA TOUR PACKAGE FROM VISAKHAPATNAM KNOW ALL DETAILS SS
IRCTC Tour: విశాఖపట్నం నుంచి దక్షిణ భారతదేశ యాత్ర... ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే
IRCTC Tour: విశాఖపట్నం నుంచి దక్షిణ భారతదేశ యాత్ర... ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)
IRCTC Tour | ఐఆర్సీటీసీ టూరిజం విశాఖపట్నం నుంచి సౌత్ ఇండియా టూర్ (South India Tour) ప్యాకేజీ ప్రకటించింది. 5 రోజుల్లో దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను చూపించనుంది.
దక్షిణ భారతదేశ యాత్రకు (South India Tour) వెళ్లాలనుకునే విశాఖపట్నం వాసులకు శుభవార్త. ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) విశాఖపట్నం నుంచి సౌత్ ఇండియా టూర్ ప్యాకేజీ ప్రకటించింది. సదరన్ డివైన్ టెంపుల్ టూర్ పేరుతో టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో మదురై, రామేశ్వరం, కన్యాకుమారి, త్రివేండ్రం లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ఆగస్ట్ 12న టూర్ ప్రారంభం కానుంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. పర్యాటకుల్ని ఫ్లైట్‌లో తీసుకెళ్లి దక్షిణ భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను చూపించనుంది. మరి ఈ టూర్ ఎలా సాగుతుందో తెలుసుకోండి.
ఐఆర్సీటీసీ టూరిజం సదరన్ డివైన్ టెంపుల్ టూర్ మొదటిరోజు విశాఖపట్నంలో ప్రారంభం అవుతుంది. ఉదయం 8.55 గంటలకు విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే 10.20 గంటలకు చెన్నై చేరుకుంటారు. చెన్నైలో మధ్యాహ్నం 12.50 గంటలకు ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 2.05 గంటలకు మదురై చేరుకుంటారు. సాయంత్రం మదురైలో మీనాక్షి దేవి ఆలయ సందర్శన ఉంటుంది. సమీపంలోని ఇతర ఆలయాలు చూడొచ్చు. రాత్రికి మదురైలో బస చేయాలి.
Southern Divine Temple tour is your ultimate spiritual call. Explore Madurai,Trivandrum,Vishakhapatnam & more with IRCTC Air tour package starts at ₹32350/- pp* for 6D/5N. For details, visit https://t.co/LcnieD9kQR@AmritMahotsav
రెండో రోజు ఉదయం రామేశ్వరం బయల్దేరాలి. ఆ తర్వాత ధనుష్కోడి సందర్శించవచ్చు. రాత్రికి రామేశ్వరంలో బస చేయాలి. మూడో రోజు రామేశ్వరం సైట్ సీయింగ్ ఉంటుంది. ఆ తర్వాత కన్యాకుమారి బయల్దేరాలి. రాత్రికి కన్యాకుమారిలో బస చేయాలి. నాలుగో రోజు సన్‌రైజ్ పాయింట్లో సూర్యోదయాన్ని సందర్శించవచ్చు. ఆ తర్వాత కన్యాకుమారి సైట్ సీయింగ్ ఉంటుంది. సాయంత్రం త్రివేండ్రం బయల్దేరాలి. రాత్రికి త్రివేండ్రంలో బస చేయాలి.
ఐదో రోజంతా త్రివేండ్రం సైట్‌సీయింగ్ ఉంటుంది. రాత్రికి త్రివేండ్రంలో బస చేయాలి. ఆరో రోజు ఉదయం 7.25 గంటలకు త్రివేండ్రంలో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 8.45 గంటలకు చెన్నై చేరుకుంటారు. చెన్నైలో ఉదయం 10.35 గంటలకు ఫ్లైట్ ఎక్కితే ఉదయం 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ టూరిజం సదరన్ డివైన్ టెంపుల్ టూర్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.32,350, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.33,770, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.43,330 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, ఏసీ హోటల్లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. లంచ్, ఫ్లైట్‌లో మీల్స్, ఫ్లైట్ టికెట్ల ధరలో మార్పులు కవర్ కావు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను https://www.irctctourism.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.