Home /News /business /

IRCTC TOURISM ANNOUNCED SOUTH INDIA TOUR BY BHARAT GAURAV TOURIST TRAIN COVERS HYDERABAD SRISAILAM RAMESHWARAM MADURAI KANYAKUMARI AND OTHER TOURIST PLACES SS

IRCTC Bharat Gaurav Train: హైదరాబాద్, కర్నూల్ మీదుగా భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్

IRCTC Bharat Gaurav Train: హైదరాబాద్, కర్నూల్ మీదుగా భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Bharat Gaurav Train: హైదరాబాద్, కర్నూల్ మీదుగా భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Bharat Gaurav Train | ఐఆర్‌సీటీసీ టూరిజం తెలుగు రాష్ట్రాల మీదుగా భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ (Bharat Gaurav Tourist Train) నడుపుతోంది. ఈరైలు హైదరాబాద్, కర్నూలు మీదుగా వెళ్తుంది.

భారతీయ రైల్వే భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాల మీదుగా ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ప్రకటించింది. సౌత్ ఇండియా టూర్ బై భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ (Bharat Gaurav Tourist Train) పేరుతో టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఎల్‌టీసీ అప్రూవ్డ్ టూర్ ఇది. 12 రాత్రులు, 13 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఢిల్లీలో 2022 అక్టోబర్ 8న టూర్ ప్రారంభం అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో హైదరాబాద్, శ్రీశైలం, కన్యాకుమారి, కాంచీపురం, మదురై, రామేశ్వరం, తంజావూర్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. మరి ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో తెలుసుకోండి.

భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ మొదటి రోజు రాత్రి 9 గంటలకు ఢిల్లీలో బయల్దేరుతుంది. పర్యాటకులు ఢిల్లీ సఫ్దర్‌గంజ్, మధుర, ఆగ్రా కాంట్, గ్వాలియర్, ఝాన్సీ, బీనా, భోపాల్, ఇటరాసి, నాగ్‌పూర్ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. మొదటి రోజు రాత్రంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు కూడా రైలు ప్రయాణమే ఉంటుంది. మూడో రోజు ఉదయం 7 గంటలకు టూరిస్ట్ రైలు హైదరాబాద్ చేరుకుంటుంది. గోల్కొండ కోట, రామానుజ విగ్రహం సందర్శించవచ్చు. మూడో రోజు రాత్రి హైదరాబాద్‌లో బస చేయాలి.

Vande Bharat Train: తెలంగాణకు వందే భారత్ ట్రైన్... దీపావళి నుంచి పరుగులు

నాలుగో రోజు చార్మినార్, చౌమాలా ప్యాలెస్, బిర్లా మందిర్, సాలార్‌జంగ్ మ్యూజియం చూడొచ్చు. సాయంత్రం 4 గంటలకు రైలులో రామేశ్వరం బయల్దేరాలి. ఐదో రోజు మధ్యాహ్నం రామేశ్వరం చేరుకుంటారు. సాయంత్రం రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించాలి. రాత్రికి రామేశ్వరంలో బస చేయాలి. ఆరో రోజు ఉదయం ధనుష్కోడి బయల్దేరాలి. ఆ తర్వాత మదురైకి ప్రయాణం మొదలవుతుంది. సాయంత్రం 6 గంటలకు మదురై చేరుకుంటారు. ఆ తర్వాత మీనాక్షి అమ్మవారి ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి కన్యాకుమారి బయల్దేరాలి.

ఏడో రోజు ఉదయం 6 గంటలకు కన్యాకుమారి చేరుకుంటారు. వివేకానంద రామ్ మెమొరియల్, కన్యాకుమారి టెంపుల్, సన్‌సెట్ పాయింట్ సందర్శన ఉంటుంది. రాత్రి 8 గంటలకు తంజావూరు బయల్దేరాలి. ఎనిమిదో రోజు ఉదయం తంజావూరు చేరుకుంటారు. యునెస్కో వాల్డ్ హెరిటేజ్ సైట్ బృహదీశ్వర ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత తంజావూర్ సైట్‌సీయింగ్ ఉంటుంది. రాత్రి 10 గంటలకు చెంగల్‌పట్టు బయల్దేరాలి. తొమ్మిదో రోజు ఉదయం 7 గంటలకు చెంగల్‌పట్టు చేరుకుంటారు. ఆ తర్వాత మహాబలిపురం బయల్దేరాలి. ఆలయం, బీచ్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత కాంచీపురం బయల్దేరాలి.

IRCTC Shirdi Tour: విజయవాడ నుంచి షిరిడీకి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

పదో రోజు విష్ణుకంచి, శివకంచి ఆలయాల సందర్శన ఉంటుంది. లంచ్ తర్వాత కామాక్షి అమ్మవారి దర్శనం ఉంటుంది. రాత్రి 8 గంటలకు రైలులో బయల్దేరాలి. ఈ రైలు పదకొండో రోజు తెల్లవారుజామున కర్నూల్ టౌన్ లేదా ఒంగోలు చేరుకుంటుంది. అక్కడి నుంచి శ్రీశైలం బయల్దేరాలి. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఆలయ సందర్శన తర్వాత ఒంగోలు బయల్దేరాలి. ఒంగోలులో రాత్రి 9 గంటలకు ఢిల్లీ వెళ్లే రైలు ఎక్కాలి. పన్నెండో రోజంతా రైలు ప్రయాణం ఉంటుంది. పదమూడో రోజు టూరిస్ట్ రైలు ఢిల్లీ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.



ఐఆర్‌సీటీసీ సౌత్ ఇండియా భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ప్యాకేజీ ధర చూస్తే కంఫర్ట్ ప్యాకేజీకి ట్రిపుల్ షేర్, డబుల్ షేర్‌కు రూ.53,970, సింగిల్ షేర్‌కి రూ.64,050, సుపీరియర్ ప్యాకేజీకి ట్రిపుల్ షేర్, డబుల్ షేర్‌కు రూ.53,475, సింగిల్ షేర్‌కి రూ.74,025 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో థర్డ్ క్లాస్ ఏసీ ప్రయాణం, ఏసీ హోటల్‌లో బస, భోజనం, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Bharat Gaurav Train, Indian Railways, IRCTC, IRCTC Tourism

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు