హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Shirdi Tour: విజయవాడ నుంచి షిరిడీకి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

IRCTC Shirdi Tour: విజయవాడ నుంచి షిరిడీకి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

IRCTC Shirdi Tour: విజయవాడ నుంచి షిరిడీకి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Shirdi Tour: విజయవాడ నుంచి షిరిడీకి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Shirdi Tour | విజయవాడ నుంచి షిరిడీ (Vijayawada to Shirdi) వెళ్లాలనుకునే సాయిబాబా భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం షిరిడీ టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది.

ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి ఈ టూర్ ప్యాకేజీలు (Tour Packages) అందుబాటులో ఉన్నాయి. విజయవాడ నుంచి షిరిడీకి (Vijayawada to Shirdi) సాయి సన్నిధి పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ప్రతీ మంగళవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఇది 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ. రైలు మార్గంలో షిరిడీకి తీసుకెళ్లి సాయిబాబా దర్శనానికి ఏర్పాట్లు చేస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీలో సాయిబాబా దర్శనంతో పాటు శనిశిగ్నాపూర్ కూడా కవర్ అవుతుంది. మరి ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో తెలుసుకోండి.

ఐఆర్‌సీటీసీ టూరిజం షిరిడీ టూర్ ప్యాకేజీ మొదటి రోజు విజయవాడలో ప్రారంభం అవుతుంది. రాత్రి 10.15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిరిడీకి బయల్దేరాలి. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత షిరిడీ ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రికి షిరిడీలో బస చేయాలి.

IRCTC South India Tour: విశాఖపట్నం నుంచి దక్షిణ భారతదేశ యాత్ర... 6 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే

మూడో రోజు ఉదయం శనిశిగ్నాపూర్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత షిరిడీ చేరుకోవాలి. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో రైలు ఎక్కితే మరుసటి రోజు తెల్లవారుజామున 2.50 విజయవాడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర చూస్తే స్టాండర్డ్ క్లాస్‌లో నలుగురి నుంచి ఆరుగురు ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.5,630, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4850 చెల్లించాలి. ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.12,280, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6,930, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5420 చెల్లించాలి.

IRCTC Cruise Tour: కేరళ వెళ్తున్నారా? ఐఆర్‌సీటీసీ క్రూజ్ టూర్ ప్యాకేజీ మీకోసమే

కంఫర్ట్ క్లాస్‌లో నలుగురి నుంచి ఆరుగురు ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.8,080, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.7310 చెల్లించాలి. ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.14,740, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.9,380, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.7880 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో స్టాండర్డ్ క్లాస్‌కి స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ క్లాస్‌కి థర్డ్ ఏసీ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Indian Railways, IRCTC, IRCTC Tourism, Shirdi, Tourism, Vijayawada

ఉత్తమ కథలు