హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Shirdi Tour: హైదరాబాద్ నుంచి షిరిడీకి ట్రైన్ టూర్... రూ.4,000 లోపే మూడు రోజుల ప్యాకేజీ

IRCTC Shirdi Tour: హైదరాబాద్ నుంచి షిరిడీకి ట్రైన్ టూర్... రూ.4,000 లోపే మూడు రోజుల ప్యాకేజీ

IRCTC Shirdi Tour: హైదరాబాద్ నుంచి షిరిడీకి ట్రైన్ టూర్... రూ.4,000 లోపే మూడు రోజుల ప్యాకేజీ
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Shirdi Tour: హైదరాబాద్ నుంచి షిరిడీకి ట్రైన్ టూర్... రూ.4,000 లోపే మూడు రోజుల ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Shirdi Tour | ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి షిరిడీకి ట్రైన్ టూర్ (Shirdi Train Tour) ప్యాకేజీ ప్రకటించింది. రూ.4,000 లోపే మూడు రోజుల ప్యాకేజీ అందిస్తోంది.

షిరిడీ వెళ్లాలనుకునే సాయి భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి షిర్డీకి (Hyderabad to Shirdi) టూర్ ప్యాకేజీ ప్రకటించింది. సాయి శివం పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. రైలులో సాయి భక్తుల్ని తీసుకెళ్లి షిర్డీలో సాయి బాబా ఆలయాన్ని చూపించనుంది. సమీపంలోని నాసిక్, త్రయంబకేశ్వర్ ప్రాంతాలు కూడా ఈ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హైదరాబాద్ నుంచి ప్రతీ శుక్రవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. వీకెండ్‌లో షిరిడీ టూర్ (Shirdi Tour) ప్లాన్ చేసుకునేవారికి ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఐఆర్‌సీటీసీ టూరిజం అందిస్తున్న టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

ఐఆర్‌సీటీసీ టూరిజం సాయి శివం టూర్ ప్యాకేజీ వివరాలు చూస్తే ఈ టూర్ ప్రతీ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. టూరిస్టులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 6.50 గంటలు అజంతా ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. రెండో రోజు ఉదయం 7.10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి షిరిడీ బయల్దేరాలి. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత షిరిడీ ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం ఖాళీ సమయం ఉంటుంది. రాత్రికి షిరిడీలో బస చేయాలి. మూడో రోజు ఉదయం నాసిక్ బయల్దేరాలి. త్రయంబకేశ్వరం, పంచవటి సందర్శించాలి. రాత్రి 9.20 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో రైలు ఎక్కితే మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

Aadhaar Card: ఆధార్ కార్డ్ ఒరిజినలో కాదో సింపుల్‌గా ఇలా వెరిఫై చేయండి

ఐఆర్‌సీటీసీ టూరిజం సాయి శివం టూర్ ప్యాకేజీ ధర చూస్తే స్లీపర్ క్లాస్ ప్రయాణానికి డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4,400, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.3,730 చెల్లించాలి. నలుగురి నుంచి ఆరుగురు బుక్ చేసుకుంటే ఈ ధరలు వర్తిస్తాయి. ఒకటి నుంచి ముగ్గురి వరకు బుక్ చేస్తే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.10,420, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.5,800, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4,350 చెల్లించాలి. థర్డ్ ఏసీ ప్రయాణానికి డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6,090, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5,420 చెల్లించాలి. నలుగురి నుంచి ఆరుగురు బుక్ చేసుకుంటే ఈ ధరలు వర్తిస్తాయి. ఒకటి నుంచి ముగ్గురి వరకు బుక్ చేస్తే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.12,100, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.7,480, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.6,030 చెల్లించాలి.

IRCTC Luggage Rules: రైలులో ఎంత లగేజ్ తీసుకెళ్లొచ్చు? రైల్వే రూల్స్ ఇవే

టూర్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ లేదా థర్డ్ ఏసీ ప్రయాణం, ఒక బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, సైట్ సీయింగ్ కవర్ అవుతాయి. లంచ్, డిన్నర్, రైలులో భోజనం, ఎంట్రెన్స్ టికెట్స్ కవర్ కావు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

First published:

Tags: Indian Railways, IRCTC, IRCTC Tourism, Shirdi, Shiridi sai

ఉత్తమ కథలు