షిరిడీ వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు (IRCTC) చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం షిరిడీ టూర్ ప్రకటించింది. భారత్ దర్శన్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ (Bharat Darshan Special Tourist Train) ద్వారా పర్యాటకుల్ని షిరిడీతో పాటు పండర్‌పూర్, శనిశిగ్నాపూర్, మంత్రాలయం లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకు తీసుకెళ్లనుంది. 'షిరిడీ స్పెషల్ గురు కృప యాత్ర' పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తమిళనాడు నుంచి ఈ టూరిస్ట్ రైలు బయల్దేరుతుంది. చిత్తూరు జిల్లాలోని తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల పర్యాటకులు రేణిగుంటలో భారత్ దర్శన్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది.
ఐఆర్‌సీటీసీ టూరిజం 'షిరిడీ స్పెషల్ గురు కృప యాత్ర' ప్యాకేజీ ధర రూ.7,060 మాత్రమే. ఈ టూర్ ప్యాకేజీలో స్లీపర్ క్లాసులో రైలు ప్రయాణం, ధర్మశాలలు, హాల్స్‌లో బస, టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, రోజూ 1 లీటర్ మంచి నీరు, నాన్ ఏసీ వాహనాల్లో ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, శానిటైజేషన్ కిట్ లాంటివి కవర్ అవుతాయి. పర్యాటక ప్రాంతాల్లో ఎంట్రెన్స్ ఫీజ్ లాంటివి ఇందులో కవర్ కావు.
The divine temple of #Shirdi needs no introduction. Travel to this holiest of places & feel one with the almighty. Train tour package starts at Rs.7,060/-pp* only. More details on https://t.co/qbf5e4KGTs *T&C Apply
— IRCTC (@IRCTCofficial) November 23, 2021
ఐఆర్‌సీటీసీ టూరిజం 'షిరిడీ స్పెషల్ గురు కృప యాత్ర' 2021 డిసెంబర్ 24న రైలు బయల్దేరుతుంది. 6 రాత్రులు, 7 రోజుల టూర్ ఇది. పర్యాటకులు మదురై, దిందిగల్, తిరుచ్చిరాపల్లి, అరియాలూర్, వృందాచలం, విల్లుపురం జంక్షన్, చెన్నై ఎగ్మోర్, రేణిగుంటలో భారత్ దర్శన్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ఎక్కొచ్చు. తిరుగు ప్రయాణంలో ఇవే స్టేషన్లలో దిగొచ్చు. మరి ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో తెలుసుకోండి.
IRCTC Kashmir Tour: హైదరాబాద్ టు కాశ్మీర్... ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ
ఐఆర్‌సీటీసీ భారత్ దర్శన్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ డిసెంబర్ 24న మదురై నుంచి బయల్దేరుతుంది. చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోని పర్యాటకులు రేణిగుంటలో ఈ రైలు ఎక్కాలి. మొదటి రోజంతా రైలు ప్రయాణమే ఉంటుంది. రెండో రోజు ఉదయం పర్యాటకులు పండర్‌పూర్ చేరుకుంటారు. అక్కడ పాండురంగ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత షిరిడీ బయల్దేరాలి. మూడో రోజు పర్యాటకులు సాయినగర్ షిరిడీ చేరుకుంటారు. రాత్రికి షిరిడీలోనే బస చేయాలి.
IRCTC Shri Ramayana Yatra: ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర ఎక్స్‌ప్రెస్ రైలు అదుర్స్ (Photos)
నాలుగో రోజు షిరిడీలో బాబా దర్శనం ఉంటుంది. నాలుగో రోజు కూడా షిరిడీలో బస చేయాలి. ఐదో రోజు ఉదయం షిరిడీ నుంచి బయల్దేరి శనిశింగ్నాపూర్ చేరుకోవాలి. దర్శనం పూర్తైన తర్వాత తిరిగి సాయినగర్ షిరిడీ చేరుకోవాలి. ఆరో రోజు మంత్రాలయానికి బయల్దేరాలి. మంత్రాలయంలో శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకొని బయల్దేరాలి. ఆ తర్వాత తిరుగు ప్రయాణం మొదలవుతుంది. పర్యాటకులు తాము రైలు ఎక్కిన స్టేషన్‌లో దిగడంతో టూర్ ముగుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, Best tourist places, Indian Railway, Indian Railways, IRCTC, IRCTC Tourism, Railways, Renigunta, Shirdi, Shiridi sai, Special Trains, Telugu news, Telugu varthalu, Tirupati, Tourism, Tourist place, Train, Train tickets, Travel