షిరిడీ వెళ్లాలనుకునే సాయిబాబా భక్తులకు శుభవార్త. ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి షిర్డీకి ఫ్లైట్లో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. షిర్డీ సాయి దర్శన్ విత్ శని శిగ్నాపూర్ (Shirdi Sai Darshan With Shani Shingnapur) పేరుతో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 1 రాత్రి, 2 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. వీకెండ్లో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. వీకెండ్లో రెండు రోజులు షిర్డీ టూర్ ప్లాన్ చేసుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. షిర్డీతో పాటు శని శిగ్నాపూర్ ఈ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతుంది. ఐఆర్సీటీసీ టూరిజం షిర్డీ టూర్ ఎలా సాగుతుందో తెలుసుకోండి.
ఐఆర్సీటీసీ టూరిజం షిర్డీ టూర్ మొదటి రోజు హైదరాబాద్లో ప్రారంభం అవుతుంది. ఉదయం 10.10 గంటలకు హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 12.05 గంటలకు షిరిడీ చేరుకుంటారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత సాయిబాబా దర్శనం ఉంటుంది. పర్యాటకులు సొంత ఖర్చులతో సాయిబాబాను దర్శించుకోవాలి. రాత్రికి షిరిడీలోనే బస చేయాలి.
IRCTC Ticket Booking: రైలు టికెట్ల బుకింగ్ ప్రాసెస్ మారింది... ఈ విషయాలు తెలుసుకోండి
రెండో రోజు ఉదయం శని శిగ్నాపూర్ బయల్దేరాలి. శని శిగ్నాపూర్ ఆలయ సందర్శన తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5.35 గంటలకు షిరిడీ ఎయిర్పోర్టులో బయల్దేరితే సాయంత్రం 6.55 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ టూరిజం షిర్డీ టూర్ ప్యాకేజీ ధర వివరాలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.10,510, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10,700, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.11,635 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, ఒక రాత్రి షిరిడీలో బస, బ్రేక్ఫాస్ట్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
IRCTC Tour: ఐఆర్సీటీసీ జగన్నాథ రథయాత్ర టూర్... హైదరాబాద్ నుంచి 3 రోజుల ప్యాకేజీ
ఈ టూర్ ప్యాకేజీలో ఆలయాల దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, లంచ్, డిన్నర్, హైదరాబాద్లో లోకల్ ట్రాన్స్పోర్ట్, ఫ్లైట్లో మీల్స్ కవర్ కావు. పర్యాటక స్థలాల్లో ఆటోలు, రిక్షాలు, ఇతర లోకల్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగిస్తే టూరిస్టులు స్వయంగా డబ్బులు చెల్లించాలి. టూరిస్టులు ఒరిజినల్ ఐడీ కార్డ్స్ తీసుకొని రావాలి. మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్లైన్స్ పాటించాలి.
షిర్డీ టూర్ ప్యాకేజీ వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం అధికారిక వెబ్సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు. ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IRCTC, IRCTC Tourism, Shirdi, Shiridi sai, Tourism, Travel