హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Nepal Tour: హైదరాబాద్ నుంచి నేపాల్... సమ్మర్ టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

IRCTC Nepal Tour: హైదరాబాద్ నుంచి నేపాల్... సమ్మర్ టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

IRCTC Nepal Tour: హైదరాబాద్ నుంచి నేపాల్... సమ్మర్ టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Nepal Tour: హైదరాబాద్ నుంచి నేపాల్... సమ్మర్ టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Nepal Tour | హైదరాబాద్ నుంచి నేపాల్ టూర్ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) నేపాల్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఆరు రోజుల్లో నేపాల్‌లోని పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు.

సమ్మర్‌లో టూర్ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి నేపాల్‌కు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. హిమాలయాల పాదాల దగ్గర ఉన్న అతి చిన్న దేశం అయిన నేపాల్‌లోని అందాలను చూడాలనుకునేవారికి నేపాల్ టూర్ ప్యాకేజీ (Nepal Tour Package) ఉపయోగపడుతుంది. 'రాయల్ నేపాల్' (Royal Nepal) పేరుతో ఈ టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. మే 29న టూర్ ప్రారంభం అవుతుంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీలో నేపాల్‌లోని ఖాట్మండు, పోఖారా ప్రాంతాలు కవర్ అవుతాయి. నేపాల్ టూర్ వెళ్లాలనుకునేవారికి తప్పనిసరిగా పాస్‌పోర్ట్ లేదా వోటర్ ఐడీ ఉండాలి. మరి ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో తెలుసుకోండి.

ఐఆర్‌సీటీసీ 'రాయల్ నేపాల్' టూర్ ప్యాకేజీ వివరాలివే


ఐఆర్‌సీటీసీ 'రాయల్ నేపాల్' టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. హైదరాబాద్‌లో ఉదయం 7.05 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 3.45 గంటలకు నేపాల్ రాజధాని ఖాట్మండు చేరుకుంటారు. సాయంత్రం ఖాళీ సమయంలో స్థానిక ప్రాంతాలు చూడొచ్చు. రాత్రికి ఖాట్మండులో బస చేయాలి. రెండో రోజు పశుపతినాథ్ ఆలయం, బుద్ధనాథ స్థూప, పఠాన్, దర్బార్ స్క్వేర్, టిబెటన్ రెఫ్యూజీ సెంటర్, స్వయంభునాథ్ స్థూపం సందర్శించవచ్చు. రాత్రికి ఖాట్మండులో బస చేయాలి.

IRCTC Vistadome Tour: అద్దాల రైలులో అద్భుత ప్రయాణం... ఐఆర్‌సీటీసీ కుక్కి టూర్ ప్యాకేజీ వివరాలివే

మూడో రోజు పోఖారకు బయల్దేరాలి. దారిలో మనకమన ఆలయం సందర్శించాలి. రాత్రికి పోఖారలో బస చేయాలి. నాలుగో రోజు తెల్లవారుజామున సూరంగ్‌కోట్‌కు బయల్దేరాలి. అక్కడ సూర్యోదయం సమయంలో హిమాలయాలు చూడొచ్చు. ఆ తర్వాత లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. బింధ్యబాసిని మందిర్, డెవిల్స్ ఫాల్, గుప్తేశ్వర్ మహాదేవ్ గుహ సందర్శించవచ్చు. రాత్రికి పోఖారలో బస చేయాలి.

IRCTC Meghalaya Tour: సమ్మర్ స్పెషల్ మేఘాలయ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

ఐదో రోజు ఖాట్మండుకు బయల్దేరాలి. రాత్రికి ఖాట్మండులో బస చేయాలి. ఆరో రోజు మధ్యాహ్నం వరకు ఖాళీ సమయం ఉంటుంది. సాయంత్రం 4.45 గంటలకు ఖాట్మండులో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 11.25 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఐఆర్‌సీటీసీ 'రాయల్ నేపాల్' టూర్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.40,000, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.41,000, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.49,650. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ బుక్ చేసే పర్యాటకులు నేపాల్ జారీ చేసిన గైడ్‌లైన్స్, ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Hyderabad, IRCTC, IRCTC Tourism, Nepal, Tourism, Travel

ఉత్తమ కథలు