హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Rann Utsav: తెల్లని ఎడారిలో రణ్ ఉత్సవ్... టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

IRCTC Rann Utsav: తెల్లని ఎడారిలో రణ్ ఉత్సవ్... టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

IRCTC Rann Utsav: తెల్లని ఎడారిలో రణ్ ఉత్సవ్... టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
(image: Rann Utsav Official Website)

IRCTC Rann Utsav: తెల్లని ఎడారిలో రణ్ ఉత్సవ్... టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ (image: Rann Utsav Official Website)

IRCTC Rann Utsav | గుజరాత్‌లో ప్రతీ ఏటా జరిగే రణ్ ఉత్సవ్‌లో పాల్గొనేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. వారి కోసం ఐఆర్‌సీటీసీ రణ్ ఉత్సవ్ టూర్ ప్యాకేజీ (Tour Package) ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

గుజరాత్‌లో ప్రతీ ఏటా జరిగే రణ్ ఉత్సవ్ (Rann Utsav) కోసం టూరిస్టులు ఎదురుచూస్తుంటారు. దీన్నే కచ్ ఫెస్టివల్ (Kutch Festival) అని కూడా పిలుస్తారు. తెల్లని ఎడారిలో జరిగే ఈ వేడుక ప్రతీ ఏటా ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచే కాదు, ఇతర దేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. రణ్ ఉత్సవ్‌ను దృష్టిలో పెట్టుకొని ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక ట్రైన్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ ముంబైలో ప్రారంభం అవుతుంది. అంటే ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు సొంత ఖర్చులతోనే ముంబై రావాల్సి ఉంటుంది. ఇది 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ. 2022 నవంబర్ 30 నుంచి ప్రతీ బుధవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

ఐఆర్‌సీటీసీ రణ్ ఉత్సవ్ టూర్ ప్యాకేజీ వివరాలివే

ఐఆర్‌సీటీసీ రణ్ ఉత్సవ్ టూర్ మొదటి రోజు ముంబైలో ప్రారంభం అవుతుంది. మొదటి రోజు సాయంత్రం 4.45 గంటలకు బాంద్రా టెర్మినస్ స్టేషన్‌లోపర్యాటకు రైలు ఎక్కాలి. దారిలో బోరివలి, సూరత్, వడోదరలో ఈ రైలు ఆగుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం భుజ్ రైల్వే స్టేషన్‌లో దిగాలి. అక్కడి నుంచి వైట్ రణ్ రిసార్ట్స్‌కు బయల్దేరాలి. కచ్ రణ్ ఉత్సవ్ జరిగే ప్రాంతానికి చేరుకున్న తర్వాత చెకిన్ కావాలి. లంచ్, ఇన్ హౌజ్ యాక్టివిటీస్ ఉంటాయి. సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూడటానికి బయల్దేరాలి. ఆ తర్వాత తిరిగి వైట్ రణ్ రిసార్ట్స్‌కు చేరుకోవాలి. రాత్రికి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. రెండో రోజు రాత్రి వైట్ రణ్ రిసార్ట్స్‌లో బస చేయాలి.

IRCTC Goa Tour: హైదరాబాద్ టు గోవా ... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

మూడో రోజు వైట్ రణ్ నుంచి కచ్ ప్రాంతంలో సూర్యోదయాన్ని చూడటానికి బయల్దేరాలి. ఆ తర్వాత కచ్ ఫెస్టివల్‌లో ఇన్ హౌజ్ యాక్టివిటీస్ ఉంటాయి. లంచ్ తర్వాత కాలా దుంగర్ టూర్ ఉంటుంది. ఇది కచ్ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశం. దారిలో హస్తకళల గ్రామం అంయిన గాంధీ ను గామ్ సందర్శించవచ్చు. సాయంత్రం కచ్‌లో టెంట్ సిటీలో కల్చరల్ యాక్టివిటీస్‌లో పాల్గొనొచ్చు. రాత్రికి వైట్ రణ్ రిసార్ట్స్‌లో బస చేయాలి.

నాలుగో రోజు రణ్ రిసార్ట్స్ నుంచి చెకౌట్ అయిన తర్వాత భుజ్ బయల్దేరాలి. దారిలో శ్రీ స్వామి నారాయణ్ టెంపుల్, కచ్ మ్యూజియం, భుజోడి సందర్శించవచ్చు. భుజ్ రైల్వే స్టేషన్‌లో రాత్రి 8.15 గంటలకు రైలు ఎక్కితే మరుసటి రోజు ఉదయం ముంబై చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఐఆర్‌సీటీసీ రణ్ ఉత్సవ్ టూర్ ప్యాకేజీ ధర

ఐఆర్‌సీటీసీ రణ్ ఉత్సవ్ టూర్ ప్యాకేజీ ధర వివరాలు చూస్తే కంఫర్ట్ ప్యాకేజీలో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.16,350, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.18,500, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.33,050 చెల్లించాలి. డీలక్స్ ప్యాకేజీలో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.17,950, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.20,500, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.34,650 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో కంఫర్ట్ క్లాస్‌కు థర్డ్ ఏసీ, డీలక్స్ ప్యాకేజీకి సెకండ్ ఏసీ రైలు టికెట్లు, ప్రీమియం ఏసీ టెంట్లు, ఏసీ రాజ్‌వాడీలో బస, వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, భోజనం కవర్ అవుతాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Indian Railway, IRCTC, IRCTC Tourism, Railways, Tourism

ఉత్తమ కథలు