తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు చుట్టూ ఉన్న ఇతర ఆలయాలను కూడా సందర్శించాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism). పూర్వ సంధ్య పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. రైలు మార్గంలో ప్రయాణికులను తిరుపతికి తీసుకెళ్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. లింగంపల్లిలో టూర్ ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్, హైదరాబాద్, నల్గొండలోని పర్యాటకులు కూడా ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. 4 రోజులు, 3 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ ప్రతీ రోజూ అందుబాటులో ఉంటుంది.
ఐఆర్సీటీసీ టూరిజం పూర్వ సంధ్య టూర్ ప్యాకేజీ మొదటి రోజు లింగంపల్లిలో ప్రారంభమవుతుంది. ప్రయాణికులు లింగంపల్లిలో సాయంత్రం 5.25 గంటలకు లింగంపల్లిలో రైలు ఎక్కాలి. ఈ రైలు సికింద్రాబాద్‌లో సాయంత్రం 6.10 గంటలకు, నల్గొండలో రాత్రి 7.38 గంటలకు బయల్దేరుతుంది. రెండో రోజు తెల్లవారుజామున 5:55 గంటలకు తిరుపతికి ప్రయాణికులు చేరుకుంటారు. ఐఆర్సీటీసీ సిబ్బంది పర్యాటకుల్ని హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ ఫ్రెషప్ అయిన తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాల సందర్శన ఉంటుంది. ఆ తర్వాత శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాలు సందర్శించుకోవచ్చు. రాత్రికి తిరుపతిలో బస చేయాలి.
IRCTC Tour: రాజమండ్రి నుంచి 9 రోజులు ఉత్తర భారతదేశ యాత్ర... ప్యాకేజీ ధర రూ.9,000 లోపే
మూడో రోజు ఉదయం 8.30 గంటలకు తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం ఉంటుంది. అదే రోజు సాయంత్రం 6.25 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరాలి. నాలుగో రోజు తెల్లవారుజామున 03:04 గంటలకు నల్గొండ, 5:35 గంటలకు సికింద్రాబాద్, 6:55 గంటలకు లింగంపల్లి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ పూర్వ సంధ్య టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.4,930. ఇది స్టాండర్డ్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీ ప్యాకేజీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4950, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.6250 చెల్లించాలి. ఇక కంఫర్ట్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీ ప్యాకేజీ ధర రూ.6790, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6810, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.8110 చెల్లించాలి.
IRCTC Goa Tour: ఏడు వేలకే గోవా టూర్... విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నుంచి ప్యాకేజీ
స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ రైలు ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ ప్రయాణం ఏసీ హోటల్లో వసతి, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆలయాల్లో సాధారణ దర్శనం, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం అధికారిక వెబ్సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IRCTC, IRCTC Tourism, Tirumala, Tirupati, Tourism, Travel