కాశీకి వెళ్లాలనుకునే పర్యాటకులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC పిలిగ్రిమ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ప్రకటించింది. దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను చూడాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్రత్యేక టూరిస్ట్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి వారణాసికి టూరిస్ట్ రైలును నడపనుంది. ఈ టూరిస్ట్ రైలు దారిలో కాజిపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్ల మీదుగా వారణాసికి వెళ్తుంది. ఆయా ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ఈ టూరిస్ట్ ట్రైన్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ టూరిస్ట్ రైలు వారణాసి, ప్రయాగ్‌రాజ్, గయ లాంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను కవర్ చేస్తుంది. 'మహాలయ పిండ దాన్ తర్పణ్' పేరుతో ఈ రైలును ప్రకటించింది ఐఆర్సీటీసీ టూరిజం. 2021 సెప్టెంబర్ 25న ఈ రైలు బయల్దేరుతుంది. 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో టూర్ ప్యాకేజీ బుక్ చేయాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ స్టాండర్డ్ ధర రూ.6,620 కాగా, కంఫర్ట్ ధర రూ.11,030. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ జర్నీ, హాల్, డార్మిటరీల్లో వసతి ఉంటుంది. కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ క్లాస్‌లో ప్రయాణం, హోటల్లో వసతి ఉంటుంది. దీంతో పాటు రోజూ టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, రోజూ 1 లీటర్ వాటర్ బాటిల్, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. లాండ్రీ, ఎంట్రెన్స్ ఫీజులు లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ కావు. ఈ టూర్ ఎలా సాగుతుందో తెలుసుకోండి.
IRCTC Hampi Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో హంపి టూర్... ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్సీటీసీ
IRCTC New Rule: ఐఆర్సీటీసీ కొత్త రూల్... టికెట్ బుక్ చేయాలంటే ఇది కంపల్సరీ
Get on #IRCTC's Pilgrim Special Tourist Train & spend 7 days & 6 nights in the holy cities of #Varanasi, #Prayagraj, #Gaya. To book this soul-soothing tour for just Rs.6,620/-pp*, visit https://t.co/wqBR8jRAh3. T&C Apply
— IRCTC (@IRCTCofficial) July 28, 2021
Day 1: మొదటి రోజు అంటే సెప్టెంబర్ 25న సికింద్రాబాద్, కాజిపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో పర్యాటకులు రైలు ఎక్కాలి.
Day 2: రెండో రోజు అర్ధరాత్రి వారణాసి చేరుకుంటారు. రాత్రికి వారణాసిలోనే బస చేయాలి.
Day 3: మూడో రోజు మొత్తం సైట్ సీయింగ్ ఉంటుంది. గంగా నదిలో పుణ్య స్నానం, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి ఆళయం, అన్నపూర్ణ దేవి ఆలయం, కాల భైరవ ఆలయాన్ని సందర్శించొచ్చు. సాయంత్రం సంధ్యా హారతి దర్శనం ఉంటుంది. రాత్రికి వారణాసిలోనే బస చేయాలి.
IRCTC Tirumala Tour: శ్రీవారి దర్శనంతో తిరుమల టూర్ ప్యాకేజీ... రూ.990 మాత్రమే
IRCTC Araku Tour: విశాఖపట్నం నుంచి అరకు టూర్... ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే
Day 4: నాలుగో రోజు ఉదయం వారణాసిలో రైలు ఎక్కి ప్రయాగ్‌రాజ్ బయల్దేరాలి. ప్రయాగ్‌రాజ్ చేరుకున్న తర్వాత గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం దర్శించుకోవాలి. అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆనంద్ భవన్, హనుమాన్ మందిర్, అలోపి శక్తిపీఠ్ దర్శించుకోవాలి. ఆ తర్వాత శృంగవేర్పూర్ వెళ్లాలి. అక్కడ రామాయణంలో అరణ్యకాండానికి సంబంధించిన ప్రాంతాలను సందర్శించుకోవచ్చు. ఆ తర్వాత గయ వెళ్లడానికి ప్రయాగ్‌రాజ్‌లో రైలు ఎక్కాలి.
Day 5: ఐదో రోజు గయలో విష్ణుపాద ఆలయాన్ని సందర్శించాలి. అక్కడే పిండప్రదానం చేయొచ్చు. ఆ తర్వాత బోధ్‌గయ సందర్శించాలి. రాత్రికి బోధ్‌గయలో తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
Day 6: ఆరో రోజు ప్రయాణికులు శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం తునిలో దిగొచ్చు.
Day 7: ఏడో రోజు ప్రయాణికులు సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజిపేట, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో దిగాలి. దీంతో టూర్ ముగుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, Best tourist places, Indian Railway, Indian Railways, IRCTC, IRCTC Tourism, Railways, Secunderabad, Secunderabad trains, Special Trains, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu, Tourism, Tourist place, Train, Train tickets, Travel, Varanasi, Vijayawada, Visakhapatnam