హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Meghalaya Tour: సమ్మర్ స్పెషల్ మేఘాలయ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

IRCTC Meghalaya Tour: సమ్మర్ స్పెషల్ మేఘాలయ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

IRCTC Meghalaya Tour: సమ్మర్ స్పెషల్ మేఘాలయ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Meghalaya Tour: సమ్మర్ స్పెషల్ మేఘాలయ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Tourism | హనీమూన్ వెళ్లాలనుకునేవారికి, కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం "మెస్మరైజింగ్ మేఘాలయ అండ్ అస్సాం" (Mesmerizing Meghalaya & Assam) టూర్ ప్యాకేజీ అందిస్తోంది.

వేసవిలో ఫ్యామిలీతో ట్రిప్ వెళ్లాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి మేఘాలయాకు టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. "మెస్మరైజింగ్ మేఘాలయ అండ్ అస్సాం" (Mesmerizing Meghalaya & Assam) పేరుతో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీలో చిరపుంజి, గువాహతి, షిల్లాంగ్ లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. 2022 ఏప్రిల్ 26న ఈ టూర్ ప్రారంభం అవుతుంది. మేఘాలయ, అస్సాంలోని పర్యాటక ప్రాంతాలను చూడాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. మరి ఈ టూర్ ప్యాకేజీ ధర ఎంత? ఈ టూర్ ఎలా సాగుతుంది? తెలుసుకోండి.

ఐఆర్‌సీటీసీ మేఘాలయ టూర్ ప్యాకేజీ వివరాలివే...


ఐఆర్‌సీటీసీ మెస్మరైజింగ్ మేఘాలయ అండ్ అస్సాం టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. మొదటి రోజు ఉదయం 9.35 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 12:15 గంటలకు గువాహతి చేరుకుంటారు. అక్కడ్నుంచి షిల్లాంగ్ తీసుకెళ్తారు. షిల్లాంగ్ చేరుకున్న తర్వాత లోకల్ మార్కెట్ సందర్శించొచ్చు. రాత్రికి షిల్లాంగ్‌లోనే బస చేయాలి.

IRCTC Vistadome Tour: అద్దాల రైలులో అద్భుత ప్రయాణం... ఐఆర్‌సీటీసీ కుక్కి టూర్ ప్యాకేజీ వివరాలివే

రెండో రోజు చిరపుంజి ట్రిప్ ఉంటుంది. దారిలో దారిలో ఎలిఫాంటా ఫాల్స్ చూడొచ్చు. రాత్రికి షిల్లాంగ్‌లోనే బస చేయాలి. మూడో రోజు ఉదయం మావ్లిన్‌నాంగ్ తీసుకెళ్తారు. లివింగ్ రూట్ బ్రిడ్జ్, దావ్కీ లేక్ సందర్శించొచ్చు. సాయంత్రానికి షిల్లాంగ్ చేరుకుంటారు. రాత్రికి షిల్లాంగ్‌లోనే బస చేయాలి. నాలుగో రోజు ఉదయం డాన్ బోస్కో మ్యూజియం, వార్డ్స్ లేక్ సందర్శించవచ్చు.

ఐదో రోజు ఉదయం గువాహతి బయల్దేరాలి. దారిలో ఉమియం సరస్సు సందర్శించవచ్చు. గువాహతి చేరుకున్న తర్వాత బ్రహ్మపుత్ర నది సందర్శించవచ్చు. రాత్రి గువాహతిలోనే బస చేయాలి. ఆరో రోజు ఉదయం కామాఖ్య ఆలయానికి తీసుకెళ్తారు. దర్శనం తర్వాత తర్వాత గువాహతి ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేస్తారు. మధ్యాహ్నం 3.35 గంటలకు గువాహతిలో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 6.25 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

IRCTC Tirupati Tour: తిరుపతి సమీపంలోని ఆలయాలు చూసేందుకు ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ

ఐఆర్‌సీటీసీ మెస్మరైజింగ్ మేఘాలయ అండ్ అస్సాం టూర్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.29,900, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.32,550, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.38,550. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటళ్లలో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబధించిన పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు.

ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు అనేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీల వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Assam, IRCTC, IRCTC Tourism, Meghalaya, Tourism, Travel

ఉత్తమ కథలు