హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Tour: వైజాగ్ నుంచి మాతా వైష్ణోదేవీ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

IRCTC Tour: వైజాగ్ నుంచి మాతా వైష్ణోదేవీ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

IRCTC Tour: వైజాగ్ నుంచి మాతా వైష్ణోదేవీ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే
(image: IRCTC Tourism)

IRCTC Tour: వైజాగ్ నుంచి మాతా వైష్ణోదేవీ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే (image: IRCTC Tourism)

IRCTC Mata Vaishno Devi tour | మాతా వైష్ణో దేవి టూర్ వెళ్లాలనుకునే తెలుగు ప్రజలకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) విశాఖపట్నం నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ఎలా సాగుతుందో తెలుసుకోండి.

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గిపోవడంతో టూర్లకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ ప్రభావం ఉన్నన్ని రోజులు టూర్లకు దూరమయ్యారు. ఇప్పుడు టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. వారికోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) వరుసగా టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. లేటెస్ట్‌గా విశాఖపట్నం నుంచి మాతా వైష్ణోదేవీ టూర్ (Mata Vaishno Devi Tour) ప్రకటించింది. ఈ ఫ్లైట్ టూర్ ప్యాకేజీలో మాతా వైష్ణోదేవి ఆలయ సందర్శనతో పాటు అమృత్‌సర్, ధర్మశాల లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. మే 22న ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.

ఐఆర్‌సీటీసీ టూరిజం మాతా వైష్ణోదేవీ టూర్ మే 22న ప్రారంభం అవుతుంది. మొదటి రోజు ఉదయం 7.55 గంటలకు పర్యాటకులు విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే 10.20 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. అదే రోజు ఢిల్లీలో సాయంత్రం 5.25 గంటలకు ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 6.40 గంటలకు అమృత్‌సర్ చేరుకుంటారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత గోల్డెన్ టెంపుల్ సందర్శన ఉంటుంది. రాత్రికి అమృత్‌సర్‌లో బస చేయాలి.

IRCTC Tirupati Tour: శ్రీవారి భక్తుల కోసం తిరుపతి నుంచి లోకల్ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

రెండో రోజు ఉదయం జలియన్‌వాలా బాగ్ సందర్శన ఉంటుంది. లంచ్ తర్వాత వాఘా బార్డర్‌కు వెళ్లొచ్చు. రాత్రికి అమృత్‌సర్‌లో బస చేయాలి. మూడో రోజు ధర్మశాలకు బయల్దేరాలి. రాత్రికి ధర్మశాలలో బస చేయాలి. నాలుగో రోజు లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. టిబెటియన్ మొనాస్ట్రీ, క్రికెట్ స్టేడియం, భగ్సునాథ్ ఆలయం సందర్శించొచ్చు.

IRCTC Kashmir Tour: హైదరాబాద్ టు కాశ్మీర్ టూర్... హౌజ్ బోట్‌లో అకామడేషన్... ప్యాకేజీ వివరాలివే

ఐదో రోజు కాట్రాకు బయల్దేరాలి. రాత్రికి కాట్రాలోనే బస చేయాలి. ఆరో రోజు కాట్రాలో వైష్ణో దేవి ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత కాట్రాకు బయల్దేరాలి. రాత్రికి కాట్రాలోనే బస చేయాలి. ఏడో రోజు జమ్మూకు బయల్దేరాలి. రఘునాథ్ మందిర్ సందర్శన ఉంటుంది. సాయంత్రం 4.25 గంటలకు జమ్మూ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కితే 5.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీలో రాత్రి 7.25 గంటలకు ఫ్లైట్ ఎక్కితే రాత్రి 9.45 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఐఆర్‌సీటీసీ మాతా వైష్ణోదేవీ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.31,760. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.32,675, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.42,100 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

First published:

Tags: IRCTC, IRCTC Tourism, Tourism, Travel, Visakhapatnam

ఉత్తమ కథలు