హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Kullu Manali Tour: సమ్మర్‌లో కులు మనాలీ వెళ్తారా? హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ

IRCTC Kullu Manali Tour: సమ్మర్‌లో కులు మనాలీ వెళ్తారా? హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ

IRCTC Kullu Manali Tour | హైదరాబాద్ నుంచి షిమ్లా, కులూమనాలీ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism). టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

IRCTC Kullu Manali Tour | హైదరాబాద్ నుంచి షిమ్లా, కులూమనాలీ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism). టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

IRCTC Kullu Manali Tour | హైదరాబాద్ నుంచి షిమ్లా, కులూమనాలీ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism). టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

  సమ్మర్‌లో చల్లని ప్రాంతాలకు వెళ్లాలని ఉందా? వేసవిలో టూర్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి షిమ్లా, కులు మనాలీ టూర్ ప్యాకేజీ (Kullu Manali Tour) ప్రకటించింది. 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హిమాచల్ హిల్స్ అండ్ వ్యాలీస్ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఫ్లైట్‌లో టూర్ తీసుకెళ్లి షిమ్లా, కులు మనాలీ, చండీగఢ్ లాంటి పర్యాటక ప్రాంతాలకు చూపిస్తుంది. వేసవిలో చల్లని ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారిని దృష్టిలో పెట్టుకొని ఈ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఈ టూర్ మే 15న ప్రారంభమై మే 22న ముగుస్తుంది. మరి ఈ టూర్ ప్యాకేజీ ఎంత? ఎలా సాగుతుంది? ఏఏ ప్రాంతాలు చూడొచ్చు తెలుసుకోండి.

  IRCTC Kullu Manali Tour: కులు మనాలీ టూర్ సాగేది ఇలాగే

  ఐఆర్‌సీటీసీ టూరిజం హిమాచల్ హిల్స్ అండ్ వ్యాలీస్ టూర్ ప్యాకేజీ మే 15న హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. మొదటి రోజు ఉదయం హైదరాబాద్‌లో 11.10 గంటలకు ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 1.45 గంటలకు చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ్నుంచి షిమ్లాకు బయల్దేరాలి. సాయంత్రం ది మాల్ సందర్శన ఉంటుంది. రాత్రికి షిమ్లాలో బస చేయాలి.

  IRCTC: తిరుపతి వెళ్తున్నారా? ఐఆర్‌సీటీసీలో హోటల్ రూమ్ బుక్ చేయండి ఇలా

  రెండో రోజు ఉదయం కుఫ్రీ సైట్‌సీయింగ్ ఉంటుంది. ఆ తర్వాత షిమ్లా లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. రాత్రికి షిమ్లాలో బస చేయాలి. మూడో రోజు ఉదయం మనాలీకి బయల్దేరాలి. దారిలో కులూ సందర్శించొచ్చు. రాత్రికి మనాలీలో బస చేయాలి. నాలుగో రోజు మనాలీ సైట్ సీయింగ్ ఉంటుంది. రాత్రికి మనాలీలో బస చేయాలి. ఐదో రోజు మనాలీ లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. అవకాశం ఉంటే రోహ్తంగ్ పాస్ టూర్ ఉంటుంది. రాత్రికి మనాలీలో బస చేయాలి.

  ఆరో రోజు చండీగఢ్ బయల్దేరాలి. రోజంతా ప్రయాణం ఉంటుంది. రాత్రికి చండీగఢ్‌లో బస చేయాలి. ఏడో రోజు రాక్ గార్డెన్, సుఖ్నా లేక్ సందర్శన ఉంటుంది. రాత్రికి చండీగఢ్‌లో బస చేయాలి. ఎనిమిదో రోజు చండీగఢ్ ఎయిర్‌పోర్టులో మధ్యాహ్నం 4.15 గంటలకు ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 6.50 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

  IRCTC Varanasi Tour: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి వారణాసికి టూర్ ప్యాకేజీ... రూ.15,000 లోపే

  ఐఆర్‌సీటీసీ టూరిజం హిమాచల్ హిల్స్ అండ్ వ్యాలీస్ టూర్ ప్యాకేజీ ధర చూస్తే ఒకరికి ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.35,850, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.37,950, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.52,200 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, రెండు రాత్రులు షిమ్లాలో, మూడు రాత్రులు మనాలీలో, రెండు రాత్రులు చండీగఢ్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

  First published:

  Tags: IRCTC, IRCTC Tourism, Shimla, Tourism, Travel

  ఉత్తమ కథలు