హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Hyderabad Tour: రూ.3,845 ధరకే ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ టూర్ ప్యాకేజీ... రామోజీ ఫిలిం సిటీ కూడా చూడొచ్చు

IRCTC Hyderabad Tour: రూ.3,845 ధరకే ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ టూర్ ప్యాకేజీ... రామోజీ ఫిలిం సిటీ కూడా చూడొచ్చు

IRCTC Hyderabad Tour: రూ.3,845 ధరకే ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ టూర్ ప్యాకేజీ... రామోజీ ఫిలిం సిటీ కూడా చూడొచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Hyderabad Tour: రూ.3,845 ధరకే ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ టూర్ ప్యాకేజీ... రామోజీ ఫిలిం సిటీ కూడా చూడొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Hyderabad Tour with Ramoji Film City | హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలతో పాటు, రామోజీ ఫిలిం సిటీ చూడాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

  హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలను చూడాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కి చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఉన్నవారు, హైదరాబాద్‌కు వచ్చేవారు మహానగరంలోని పర్యాటక ప్రాంతాలను చూడాలనుకుంటే ఈ టూర్ ప్యాకేజీ (Hyderabad Tour Package) ఉపయోగపడుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City) తీసుకెళ్తారు. 'హైదరాబాద్ టూర్ విత్ రామోజీ ఫిలిం సిటీ' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. 1 రోజు, 2 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. రామోజీ ఫిలిం సిటీతో పాటు హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలన్నీ ఈ టూర్‌లో కవర్ అవుతాయి.

  ఐఆర్‌సీటీసీ 'హైదరాబాద్ టూర్ విత్ రామోజీ ఫిలిం సిటీ' టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.3,845 మాత్రమే. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.5,135, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.9,750 చెల్లించాలి. గ్రూప్ బుకింగ్ ధరలు వేరుగా ఉన్నాయి. 4 నుంచి 6 మంది కలిపి బుక్ చేస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4,010, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4,305 చెల్లించాలి. 7 నుంచి 12 మంది కలిపి బుక్ చేస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.3,940, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4,235 చెల్లించాలి.

  IRCTC Tirupati Tour: శ్రీవారి ప్రత్యేక దర్శనంతో ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ... హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో టూర్

  ప్యాకేజీలో ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, త్రీ స్టార్ హోటల్‌లో ఏసీ అకామడేషన్, డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివన్నీ కవర్ అవుతాయి. సైట్ సీయింగ్ ప్రాంతాల్లో ఎంట్రెన్స్ ఫీజు, టూర్ గైడ్ సర్వీసెస్, లంచ్ కవర్ కావు. ఈ ప్యాకేజీ ధరల్లో మార్పు ఉండొచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

  IRCTC Tirumala Tour: విజయవాడ నుంచి రూ.3,220 ధరకే తిరుపతి టూర్ ప్యాకేజీ... శ్రీవారి ప్రత్యేక దర్శనం కూడా

  ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో చూస్తే పర్యాటకుల్ని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఐఆర్‌సీటీసీ సిబ్బంది రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, సాలార్‌జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీద్, చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, కుతుబ్ షాహీ టూంబ్స్ లాంటివి మొదటి రోజు చూడొచ్చు. రాత్రి హోటల్‌లో బస చేయాలి రెండో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత రామోజీ ఫిలిం సిటీ తీసుకెళ్తారు. రాత్రికి తిరిగి హైదరాబాద్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయడంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Best tourist places, Hyderabad, Hyderabad news, IRCTC, IRCTC Tourism, Tourism, Tourist place, Travel

  ఉత్తమ కథలు