హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Kerala Tour: హైదరాబాద్ టు కేరళ ఫ్లైట్ టూర్... బోట్ హౌజ్‌లో బస... ప్యాకేజీ వివరాలివే

IRCTC Kerala Tour: హైదరాబాద్ టు కేరళ ఫ్లైట్ టూర్... బోట్ హౌజ్‌లో బస... ప్యాకేజీ వివరాలివే

IRCTC Kerala Tour: హైదరాబాద్ టు కేరళ ఫ్లైట్ టూర్... బోట్ హౌజ్‌లో బస... ప్యాకేజీ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Kerala Tour: హైదరాబాద్ టు కేరళ ఫ్లైట్ టూర్... బోట్ హౌజ్‌లో బస... ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Kerala Tour | ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ నుంచి కేరళకు టూర్ ప్యాకేజీ (Kerala Tour Package) ప్రకటించింది. అలెప్పీ, కొచ్చి, మున్నార్, త్రివేండ్రంలోని పర్యాటక ప్రాంతాల చూడొచ్చు. హౌజ్ బోట్‌లో బస చేయొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

చలికాలంలో కేరళలోని ప్రకృతి అందాలను వీక్షించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి కేరళకు (Hyderabad to Kerala) ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు వారం రోజుల పాటు కేరళలోని పర్యాటక ప్రాంతాలు చుట్టేయొచ్చు. కేరళ డిలైట్స్ (Kerala Delights) పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో అలెప్పీ, కొచ్చి, మున్నార్, త్రివేండ్రం కవర్ అవుతాయి. ఒక రోజు బోట్ హౌజ్‌లో బస కూడా చేయొచ్చు. కేరళ టూర్ ప్యాకేజీ 2022 అక్టోబర్ 7న ప్రారంభమై అక్టోబర్ 13న ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర, పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఐఆర్‌సీటీసీ కేరళ టూర్ ప్యాకేజీ వివరాలివే


ఐఆర్‌సీటీసీ కేరళ టూర్ ప్యాకేజీ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. తెల్లవారుజామున 5.45 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 7.20 గంటలకు కొచ్చిన్ చేరుకుంటారు. హోటల్‌లో బస చేసిన తర్వాత ఫోర్ట్ కొచ్చి, డచ్ ప్యాలెస్, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ కవర్ అవుతాయి. సాయంత్రం మెరైన్ డ్రైవ్ ఉంటుంది. రాత్రికి కొచ్చిలోనే బస చేయాలి.
Pension Scheme: త్వరలో ఈపీఎఫ్ఓ కొత్త పెన్షన్ స్కీమ్... కనీస పెన్షన్ రూ.3,000



రెండో రోజు మున్నార్ టూర్ ఉంటుంది. దారిలో చీయపార వాటర్‌ఫాల్స్ కూడా చూడొచ్చు. టీ మ్యూజియం సందర్శించవచ్చు. రాత్రికి మున్నార్‌లో బస చేయాలి. మూడో రోజు మున్నార్ సైట్‌సీయింగ్ ఉంటుంది. మెట్టుపెట్టి డ్యామ్, ఇకో పాయింట్, కుండ్లా డ్యామ్ లేక్ చూడొచ్చు. రాత్రికి మున్నార్‌లో బస చేయాలి. నాలుగో రోజు తేక్కడి బయల్దేరాలి. దారిలో స్పైస్ ప్లాంటేషన్స్ చూడొచ్చు. రాత్రికి తేక్కడిలో బస చేయాలి.
ఐదో రోజు అలెప్పీ లేదా కుమారకోమ్ బయల్దేరాలి. హౌజ్ బోట్‌లో చెకిన్ కావాలి. హౌజ్ బోట్‌లోనే లంచ్ చేయాలి. బ్యాక్ వాటర్స్‌లో ప్రయాణిస్తూ డిన్నర్ కూడా చేయొచ్చు. రాత్రికి అలెప్పీ లేదా కుమారకోమ్‌లో బస చేయొచ్చు. ఆరో రోజు త్రివేండ్రం బయల్దేరాలి. దారిలో జటాయు ఎర్త్ సెంటర్ చూడొచ్చు. రాత్రికి త్రివేండ్రంలో బస చేయాలి. ఏడో రోజు ఉదయం పద్మనాభ స్వామి ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత నేపియర్ మ్యూజియం చూడొచ్చు. రాత్రి 9.40 గంటలకు త్రివేండ్రం ఫ్లైట్ ఎక్కితే రాత్రి 11.25 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
Credit Card: క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి


ఐఆర్‌సీటీసీ కేరళ టూర్ ప్యాకేజీ ధర ఎంతంటే


ఐఆర్‌సీటీసీ కేరళ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.33,550. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.36,500, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.50,800 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఒక రోజు లంచ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: IRCTC, IRCTC Tourism, Kerala, Tourism, Travel

ఉత్తమ కథలు