హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Tour: ఖజురహో శిల్పాలు చూస్తారా? హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ

IRCTC Tour: ఖజురహో శిల్పాలు చూస్తారా? హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ

IRCTC Tour: ఖజురహో శిల్పాలు చూస్తారా? హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Tour: ఖజురహో శిల్పాలు చూస్తారా? హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Khajuraho Tour | హైదరాబాద్ నుంచి ఖజురహో టూర్ ప్లాన్ చేసుకునేవారికి గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం తక్కువ ధరకే ట్రైన్ టూర్ ప్యాకేజీ (Train Tour Pacakges) ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

దసరా సెలవుల్లో లాంగ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో టూర్ వెళ్లే ఆలోచన ఉందా? మధ్యప్రదేశ్‌లోని ఖజురహో (Khajuraho) శిల్ప సౌందర్యం చూడాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'హెరిటేజ్ ఆఫ్ మధ్యప్రదేశ్' పేరుతో ట్రైన్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో (IRCTC Tour Package) మధ్యప్రదేశ్‌లోని ఖజురహోతో పాటు గ్వాలియర్, ఓర్ఛా లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ప్రతీ శుక్రవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు, ప్యాకేజీ ధర ఎంత, టూర్ ఎలా సాగుతుంది అన్న వివరాలు తెలుసుకోండి.

ఐఆర్‌సీటీసీ మధ్యప్రదేశ్ టూర్ ప్యాకేజీ వివరాలివే

ఐఆర్‌సీటీసీ టూరిజం హెరిటేజ్ ఆఫ్ మధ్యప్రదేశ్ టూర్ ప్యాకేజీ వివరాలు చూస్తే ప్రతీ శుక్రవారం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసిన పర్యాటకులు శుక్రవారం సాయంత్రం 4.40 గంటలకు కాచిగూడలో, రాత్రి 7.10 గంటలకు కాజిపేటలో సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కొచ్చు. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు గ్వాలియర్ చేరుకుంటారు. ఆ తర్వాత చౌసత్ యోగిని ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి గ్వాలియర్‌లోనే బస చేయాలి.

LIC Policy: జస్ట్ నెలకు రూ.2,000 పొదుపు చేస్తే చాలు... రూ.48 లక్షల రిటర్న్స్

మూడో రోజు ఉదయం గ్వాలియర్ కోట సందర్శించవచ్చు. ఆ తర్వాత జై విలాస్ ప్యాలెస్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత ఓర్చా బయల్దేరాలి. ఓర్చా కోట సందర్శించిన తర్వాత ఖజురహో బయల్దేరాలి. రాత్రికి ఖజురహోలో బస చేయాలి. నాలుగో రోజు ఉదయం ఖజురహో స్థానిక ఆలయాల సందర్శన ఉంటుంది. సాయంత్రం లైట్ అండ్ సౌండ్ షో చూడొచ్చు. రాత్రికి ఖజురహోలో బస చేయాలి. ఐదో రోజు మధ్యాహ్నం రనేహ్ వాటర్ ఫాల్స్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత సాత్నా బయల్దేరాలి. రాత్రి 11.15 గంటలకు సాత్నా రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కాలి. ఆరో రోజు రాత్రి 9.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

Money Matters: అలర్ట్... ఈ శుక్రవారం షాక్ తప్పదు... గుర్తుంచుకోండి

ఐఆర్‌సీటీసీ మధ్యప్రదేశ్ టూర్ ప్యాకేజీ ధర

ఐఆర్‌సీటీసీ మధ్యప్రదేశ్ టూర్ ప్యాకేజీ స్టాండర్డ్ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.8,760, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10,370 చెల్లించాలి. కంఫర్ట్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.13,440, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.15,530 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో స్టాండర్డ్ ప్యాకేజీకి స్లీపర్ క్లాస్, కంఫర్ట్ ప్యాకేజీకి థర్డ్ ఏసీ ప్రయాణం, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Holidays, IRCTC, IRCTC Tourism, Tourism

ఉత్తమ కథలు