హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Kerala Tour: సమ్మర్‌లో కేరళ టూర్... హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ

IRCTC Kerala Tour: సమ్మర్‌లో కేరళ టూర్... హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ

IRCTC Kerala Tour | సమ్మర్‌లో కేరళ టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism). ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

IRCTC Kerala Tour | సమ్మర్‌లో కేరళ టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism). ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

IRCTC Kerala Tour | సమ్మర్‌లో కేరళ టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism). ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

వేసవిలో స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) వరుసగా టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. దేశంలోని వేర్వేరు పర్యాటక ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. సమ్మర్‌లో ఊటీ వెళ్లాలనుకుంటే (Ooty Tour) ఐఆర్‌సీటీసీ ఊటీ టూర్ ప్యాకేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక కులూమనాలీలో విహరించాలనుకుంటే ఐఆర్‌సీటీసీ కులూమనాలీ టూర్ ప్యాకేజీ వివరాలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. ఇక తాజాగా ఐఆర్‌సీటీసీ టూరిజం గ్రాండ్ మలబార్ (Grand Malabar) పేరుతో కేరళకు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఫ్లైట్‌లో కేరళ తీసుకెళ్లి కొచ్చి, మున్నార్, అలెప్పీ, త్రివేండ్రం లాంటి ప్రాంతాలను చూపించనుంది ఐఆర్‌సీటీసీ టూరిజం. మే 3న టూర్ ప్రారంభమై మే 8న ముగుస్తుంది.

టూర్ సాగేది ఇలాగే

ఐఆర్‌సీటీసీ టూరిజం గ్రాండ్ మలబార్ టూర్ ప్యాకేజీ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. తెల్లవారుజామున 5.45 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కితే కొచ్చిన్ విమానాశ్రయానికి ఉదయం 7.20 గంటలకు చేరుకుంటారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత ఫోర్ట్ కొచ్చి, డచ్ ప్యాలెస్, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్, మెరైన్ డ్రైవ్ సందర్శన ఉంటుంది. రాత్రికి కొచ్చిలో బస చేయాలి.

IRCTC Tirupati Tour: తిరుపతి నుంచి లోకల్ టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ టూరిజం

రెండో రోజు ఉదయం మున్నార్ బయల్దేరాలి. దారిలో చీయపార వాటర్ ఫాల్స్, టీ మ్యూజియం సందర్శించవచ్చు. రాత్రికి మున్నార్‌లో బస చేయాలి. మూడో రోజు మున్నార్ సైట్ సీయింగ్ ఉంటుంది. మెట్టుపెట్టి డ్యామ్, ఇకో పాయింట్, కుండ్లా డ్యామ్ లేక్ సందర్శించవచ్చు. రాత్రికి మున్నార్‌లో బస చేయాలి.

నాలుగో రోజు ఉదయం అలెప్పీ బయల్దేరాలి. అలెప్పీలోని వెంబనాడ్ సరస్సులో బోటింగ్ ఎంజాయ్ చేయొచ్చు. సాయంత్రం అలెప్పీ బీచ్‌కు వళ్లొచ్చు. రాత్రికి అలెప్పీలో బస చేయాలి. ఐదో రోజు ఉదయం త్రివేండ్రం బయల్దేరాలి. దారిలో జటాయు ఎర్త్ సెంటర్ సందర్శించొచ్చు. రాత్రికి త్రివేండ్రంలో బస చేయాలి.

IRCTC Varanasi Tour: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి వారణాసికి టూర్ ప్యాకేజీ... రూ.15,000 లోపే

ఆరో రోజు శ్రీ పద్మనాభస్వామి ఆలయ సందర్శన ఉంటుంది. నపియార్ మ్యూజియం సందర్శించిన తర్వాత పర్యాటకుల్ని త్రివేండ్రం ఎయిర్ పోర్టులో డ్రాప్ చేస్తారు. త్రివేండ్రం విమానాశ్రయంలో రాత్రి 9.40 గంటలకు ఫ్లైట్ ఎక్కితే రాత్రి 11.25 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఐఆర్‌సీటీసీ టూరిజం గ్రాండ్ మలబార్ టూర్ ప్యాకేజీ ధర వివరాలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.26,550, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.28,000, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.36,550 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

First published:

Tags: Hyderabad, IRCTC, IRCTC Tourism, Kerala, Tourism, Travel

ఉత్తమ కథలు