IRCTC TOURISM ANNOUNCED GOVINDAM TOUR PACKAGE TO TIRUPATI FROM HYDERABAD INCLUDES SPECIAL ENTRY DARSHNAM AT TIRUMALA SS
IRCTC Govindam Tour: హైదరాబాద్ నుంచి తిరుపతి టూర్... శ్రీవారి ప్రత్యేక దర్శనం ఉచితం... ప్యాకేజీ ధర రూ.4,000 లోపే
IRCTC Govindam Tour: హైదరాబాద్ నుంచి తిరుపతి టూర్... శ్రీవారి ప్రత్యేక దర్శనం ఉచితం... ప్యాకేజీ ధర రూ.4,000 లోపే
(ప్రతీకాత్మక చిత్రం)
IRCTC Govindam Tour | శ్రీవారి భక్తుల కోసం హైదరాబాద్ నుంచి తిరుపతికి మరో టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism). ఈ ప్యాకేజీ బుక్ చేసే ప్రయాణికులు తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉచితంగా పొందొచ్చు.
తిరుమల వెళ్లాలనుకునే శ్రీవారి భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) తిరుపతికి మరో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీలో తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉచితం. గోవిందం టూర్ పేరుతో ఈ రైల్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. మూడు రోజులు, రెండు రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. ట్రైన్‌లో పర్యాటకుల్ని తిరుపతికి తీసుకెళ్తుంది ఐఆర్‌సీటీసీ. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో (Tirumala Special Entry Darshnam) పాటు తిరుచానూర్ కవర్ అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. రెండుమూడు రోజుల పాటు తిరుమల వెళ్లాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.
IRCTC Govindam Tour: టూర్ ఎలా కొనసాగుతుందంటే...
పర్యాటకులు మొదటి రోజు 12734 నెంబర్ గల రైలును లింగంపల్లిలో సాయంత్రం 5.25 గంటలకు, సికింద్రాబాద్‌లో 6.10 గంటలకు, నల్గొండలో రాత్రి 7.38 గంటలకు ఎక్కాలి. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది. రెండో రోజు తెల్లవారుజామున 5.55 గంటలకు తిరుపతి చేరుకుంటారు. ఐఆర్‌సీటీసీ సిబ్బంది రిసీవ్ చేసుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత తిరుమలకు తీసుకెళ్తారు. ఉదయం 8.30 గంటలకు స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవచ్చు.
Undertake a blissful temple tour with #IRCTCTourism's 3D/2N 'Govindam' package. Tariff includes train journey, accommodation, road transfers, sightseeing, breakfast, tour guide, travel insurance & more. #Book now on https://t.co/GmOL3XtgDp
తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత తిరుపతిలోని హోటల్‌కు తీసుకెళ్తారు. లంచ్ తర్వాత తిరుచానూర్ తీసుకెళ్తారు. తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి దర్శనం తర్వాత సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు. సాయంత్రం 6.25 గంటలకు 12733 నెంబర్ గల రైలు ఎక్కితే మూడో రోజు తెల్లవారుజామున 3.04 గంటలకు నల్గొండలో, 5.35 గంటలకు సికింద్రాబాద్‌లో, 6.55 గంటలకు లింగంపల్లి రైలు చేరుకుంటుంది.
IRCTC Tour: రాజమండ్రి నుంచి 9 రోజులు ఉత్తర భారతదేశ యాత్ర... ప్యాకేజీ ధర రూ.9,000 లోపే
IRCTC Govindam Tour: ప్యాకేజీ ధర ఎంతంటే...
ఐఆర్‌సీటీసీ టూరిజం గోవిందం టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.3,690, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.3,770, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.4,510. ఇక కంఫర్ట్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.5,540, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.5,630, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.6,370. కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ రైలు ప్రయాణం, స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ రైలు ప్రయాణం, ఏసీ హోటల్‌లో బస, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీ సంబంధించిన మరిన్ని వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.