హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో రాజస్తాన్ టూర్... ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

IRCTC Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో రాజస్తాన్ టూర్... ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

IRCTC Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో రాజస్తాన్ టూర్... ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో రాజస్తాన్ టూర్... ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Golden Sands of Rajasthan | హైదరాబాద్ నుంచి రాజస్తాన్ టూర్ (Rajasthan Tour) వెళ్లాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

రాజస్తాన్‌లోని పర్యాటక ప్రాంతాలు చూడాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'గోల్డెన్ సాండ్స్ ఆఫ్ రాజస్తాన్' (Golden Sands of Rajasthan) పేరుతో హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఐఆర్‌సీటీసీ ఫ్లైట్‌లో పర్యాటకుల్ని రాజస్తాన్ తీసుకెళ్తుంది. ఈ టూర్‌లో రాజస్తాన్‌లోని జైపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, పుష్కర్ లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. 2022 ఫిబ్రవరి 10న టూర్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 15న టూర్ ముగుస్తుంది. ఈ టూర్ బుక్ చేసుకునే పర్యాటకులు తప్పనిసరిగా కోవిడ్ 19 రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకోవాలి. వ్యాక్సిన్ సర్టిఫికెట్స్ సమర్పించాలి. రెండు డోసులు తీసుకోనివారు, 18 ఏళ్లలోపు వారు ఆర్‌టీ పీసీఆర్ నెగిటీవ్ సర్టిఫికెట్ సమర్పించాలి.

IRCTC Araku Tour: వీకెండ్‌లో అరకు టూర్ వెళ్తారా? ఈ ప్యాకేజీ మీకోసమే

IRCTC Golden Sands of Rajasthan: ఐఆర్‌సీటీసీ గోల్డెన్ సాండ్స్ ఆఫ్ రాజస్తాన్ ప్యాకేజీ వివరాలు ఇవే...


ఫిబ్రవరి 10: మొదటి రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 9 గంటలకు జోధ్‌పూర్ చేరుకుంటారు. ఆ తర్వాత హోటల్‌కు తీసుకెళ్తారు. కాసేపు విశ్రాంతి తీసుకుని లంచ్ చేసిన తర్వాత మెహ్రాన్‌గఢ్ ఫోర్ట్‌కు తీసుకెళ్తారు. ఆ తర్వాత షాపింగ్ కోసం సమయం ఉంటుంది. రాత్రికి జోధ్‌పూర్‌లోనే బస చేయాలి.

ఫిబ్రవరి 11: రెండో రోజు హోటల్ నుంచి చెకౌట్ అయిన తర్వాత ఉమైద భవన్ ప్యాలెస్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత జైసల్మేర్ బయల్దేరాలి. రాత్రికి జైసల్మేర్‌లోనే బస చేయాలి.

ఫిబ్రవరి 12: మూడో రోజు జైసల్మేర్ ఫోర్ట్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత స్యామ్ సాండ్ డ్యూన్స్‌కు బయల్దేరాలి. అక్కడ డిసర్ట్ క్యాంప్ ఉంటుంది. ఎడారిలో టెంట్‌లో బస కల్పిస్తారు. డిసర్ట్ సఫారీ, క్యామెల్ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. రాత్రికి జైసల్మేర్‌లోనే బస చేయాలి.

ఫిబ్రవరి 13: నాలుగో రోజు జైసల్మేర్ నుంచి పుష్కర్ బయల్దేరాలి. సాయంత్రానికి పుష్కర్ చేరుకుంటారు. రాత్రికి పుష్కర్‌లోనే బస చేయాలి.

IRCTC Tour: టూరిస్టులకు గుడ్ న్యూస్... హైదరాబాద్ నుంచి 'టెంపుల్ రన్' ప్యాకేజీ

ఫిబ్రవరి 14: ఐదో రోజు బ్రహ్మ ఆలయాన్ని సందర్శించాలి. ఆ తర్వాత జైపూర్ బయల్దేరాలి. జైపూర్‌లో సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్, హవా మహల్ సందర్శించొచ్చు. రాత్రికి జైపూర్‌లోనే బస చేయాలి.

ఫిబ్రవరి 15: ఆరో రోజున అమెర్ ఫోర్ట్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 5.40 గంటలకు జైపూర్‌లో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 7.40 గంటలకు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఈ టూర్ ప్యాకేజీ ధర వివరాలు చూస్తే... ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.29,050, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.29,950, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.38,950 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. మరిన్ని వివరాల కోసం https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

First published:

Tags: Best tourist places, Hyderabad, Hyderabad news, IRCTC, IRCTC Tourism, Rajasthan, Tourism, Tourist place, Travel

ఉత్తమ కథలు