హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Goa Tour: గోవాలో హనీమూన్... హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

IRCTC Goa Tour: గోవాలో హనీమూన్... హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

IRCTC Goa Tour: గోవాలో హనీమూన్... హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Goa Tour: గోవాలో హనీమూన్... హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Goa Tour | హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేకమైన ప్యాకేజీ (Goa Package) అందిస్తోంది. 3 రోజుల పాటు గోవాలోని పర్యాటక ప్రాంతాలను చూపించనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

గోవాలో హనీమూన్ ప్లాన్ చేసుకునే జంటలకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) హైదరాబాద్ నుంచి గోవాకు (Hyderabad to Goa) టూర్ ప్యాకేజీ ప్రకటించింది. టూరిస్టుల్ని ఫ్లైట్‌లో గోవాకు తీసుకెళ్లి అక్కడి పర్యాటక ప్రాంతాలను చూపించనుంది ఐఆర్‌సీటీసీ. 'గోవా డిలైట్' (Goa Delight) పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇది 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో అర్వాలెమ్ కేవ్స్, వాటర్‌ఫాల్స్, ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్, రీస్ మేగస్ ఫోర్ట్, బోండ్లా వైల్డ్‌లైఫ్ సాంక్చువరీ, మంగేషీ టెంపుల్ లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. టూరిస్టులు గోవాలో ఉన్న బీచ్‌లు, ప్రకృతి అందాలను చూడొచ్చు. హైదరాబాద్ నుంచి గోవా టూర్ 2022 నవంబర్ 24న ప్రారంభమై, నవంబర్ 27న టూర్ ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

హైదరాబాద్-గోవా టూర్ ప్యాకేజీ వివరాలివే

ఐఆర్‌సీటీసీ గోవా డిలైట్ టూర్ ప్యాకేజీ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4.20 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 5.35 గంటలకు గోవా చేరుకుంటారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత జువారీ రివర్ సందర్శించవచ్చు. రాత్రికి గోవాలో బస చేయాలి. రెండో రోజు సౌత్ గోవా టూర్ ఉంటుంది. ఓల్డ్ గోవా చర్చ్, ఆర్కియలాజికల్ మ్యూజియం, వ్యాక్స్ వాల్డ్ మ్యూజియం, శ్రీ మంగేషీ ఆలయం, మిరామర్ బీచ్ సందర్శించవచ్చు. సాయంత్రం మండోవి రివర్‌లో బోట్ క్రూజ్ ఎంజాయ్ చేయొచ్చు. రాత్రికి గోవాలోనే బస చేయాలి.

IRCTC Kerala Tour: హైదరాబాద్ టు కేరళ ఫ్లైట్ టూర్... బోట్ హౌజ్‌లో బస... ప్యాకేజీ వివరాలివే

ఇక మూడో రోజు నార్త్ గోవా సైట్ సీయింగ్ ఉంటుంది. ఫోర్ట్ అగ్వాడా, కండోలిమ్ బీచ్, బాగా బీచ్ చూడొచ్చు. సొంత ఖర్చులతో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో పాల్గొనొచ్చు. ఆ తర్వాత అంజునా బీచ్, వాగేటర్ బీచ్, చపోరా ఫోర్ట్ సందర్శించవచ్చు. రాత్రికి గోవాలో బస చేయాలి. నాలుగో రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు గోవాలో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

IRCTC Tirupati Tour: సెప్టెంబర్‌లో హైదరాబాద్ నుంచి తిరుపతి టూర్ ప్యాకేజీలు

ఐఆర్‌సీటీసీ గోవా డిలైట్ టూర్ ప్యాకేజీ ధర

ఐఆర్‌సీటీసీ గోవా డిలైట్ టూర్ ప్యాకేజీ ధర వివరాలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.20,980, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.21,455, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.27,330 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, ఏసీ హోటల్‌లో అకామడేషన్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Goa, Goa beach, IRCTC, IRCTC Tourism, Travel

ఉత్తమ కథలు