అయోధ్య, వారణాసి లాంటి పుణ్యక్షేత్రాలు సందర్శించాలనుకునే శ్రీరామ భక్తులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'గంగా రామాయణ్ యాత్ర' (Ganga Ramayan Yatra) పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఫ్లైట్‌లో పర్యాటకుల్ని తీసుకెళ్లి అయోధ్య, నైమీశరణ్య, ప్రయాగ్‌రాజ్, సార్‌నాథ్, వారణాసిలోని పుణ్యక్షేత్రాలను చూపించనుంది ఐఆర్‌సీటీసీ. 2022 ఆగస్ట్ 15, 20 తేదీల్లో ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో తెలుసుకోండి.
ఐఆర్‌సీటీసీ టూరిజం గంగా రామాయణ్ యాత్ర బుక్ చేసిన పర్యాటకులు మొదటి రోజు హైదరాబాద్‌లో ఉదయం 9.15 గంటలకు ఫ్లైట్ ఎక్కితే 11.15 గంటలకు వారణాసి చేరుకుంటారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత గంగా ఘాట్, కాశీ ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి వారణాసిలో బస చేయాలి. రెండో రోజు ఉదయం సార్‌నాథ్ సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం తిరిగి వారణాసి చేరుకోవాలి. భూ ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం ఘాట్స్ సందర్శించడానికి, షాపింగ్ చేయడానికి సమయ ఉంటుంది. రాత్రికి వారణాసిలో బస చేయాలి.
IRCTC Kashmir Tour: హౌజ్ బోట్‌లో అకామడేషన్‌తో కాశ్మీర్ టూర్... హైదరాబాద్ నుంచి ప్యాకేజీ
మూడో రోజు ప్రయాగ్‌రాజ్ బయల్దేరాలి. ఆనంద్ భవన్, అలోపి దేవి ఆలయం, త్రివేణి సంగమం సందర్శన ఉంటుంది. సాయంత్రం అయోధ్యకు బయల్దేరాలి. రాత్రికి అయోధ్యలో బస చేయాలి. నాలుగో రోజు అయోధ్య ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత లక్నో బయల్దేరాలి. రాత్రికి లక్నోలో బస చేయాలి.
ఐదో రోజు నైమీశరణ్య ఫుల్ డే టూర్ ఉంటుంది. సాయంత్రం తిరిగి లక్నో చేరుకోవాలి. రాత్రికి లక్నోలో బస చేయాలి. ఆరో రోజు బారా ఇమాంబారా, అంబేద్కర్ మెమొరియల్ పార్క్ సందర్శన ఉంటుంది. లక్నోలో రాత్రి 8.15 గంటలకు ఫ్లైట్ ఎక్కితే రాత్రి 10.15 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
IRCTC Thailand Tour: బ్యాంకాక్ వెళ్తారా? థాయ్‌ల్యాండ్ టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
ఐఆర్‌సీటీసీ టూరిజం గంగా రామాయణ్ యాత్ర టూర్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.27,950 కాగా, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.29,650 చెల్లించాలి. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.36,600 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, రెండు రాత్రులు వారణాసిలో, ఒక రాత్రి అయోధ్యలో, రెండు రాత్రులు లక్నోలో బస చేయాలి. బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayodhya, Ayodhya Ram Mandir, IRCTC, IRCTC Tourism, Varanasi