హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Kashmir Tour: కాశ్మీర్ టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ... తులీప్ గార్డెన్ ఫెస్టివల్ చూడొచ్చు

IRCTC Kashmir Tour: కాశ్మీర్ టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ... తులీప్ గార్డెన్ ఫెస్టివల్ చూడొచ్చు

IRCTC Kashmir Tour: కాశ్మీర్ టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ... తులీప్ గార్డెన్ ఫెస్టివల్ చూడొచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Kashmir Tour: కాశ్మీర్ టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ... తులీప్ గార్డెన్ ఫెస్టివల్ చూడొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Enchanting Kashmir | కాశ్మీర్ లోయలోని అందాలను చూడాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ కాశ్మీర్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది.

  'ఎన్‌ఛాంటింగ్ కాశ్మీర్' పేరుతో ఐఆర్‌సీటీసీ కాశ్మీర్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారు గుల్మార్గ్, పహల్గమ్, శ్రీనగర్, సోన్‌మార్గ్ చూడొచ్చు. ప్రతీ ఏటా ఏప్రిల్ మాసంలో జరిగే తులీప్ గార్డెన్ ఫెస్టివల్ కూడా చూడొచ్చు. 2021 మార్చి 30, ఏప్రిల్ 20 తేదీల్లో టూర్ మొదలవుతుంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ఇది. ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.24,935. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. ఇక డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.25,825 కాగా, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.38,705. టూర్ ఢిల్లీ నుంచి మొదలవుతుంది. కాబట్టి పర్యాటకులు టూర్ మొదలయ్యే సమయానికి ఢిల్లీ చేరుకోవాల్సి ఉంటుంది. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, అకామడేషన్, ఒకరోజు హౌజ్ బోట్‌లో స్టే, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో బుక్ చేయాల్సి ఉంటుంది.

  IRCTC Enchanting Kashmir: ఐఆర్‌సీటీసీ కాశ్మీర్ టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే


  Day 1: మొదటి రోజు ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పర్యాటకులను ఐఆర్‌సీటీసీ సిబ్బంది రివీస్ చేసుకుంటారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 10.30 గంటలకు శ్రీనగర్ చేరుకుంటారు. మధ్యాహ్నం వరకు విశ్రాంతి తీసుకోవచ్చు. సాయంత్రం దాల్ సరస్సులో షికారా రైడ్ ఉంటుంది. సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేయొచ్చు. చార్ చినర్ ఫ్లోటింగ్ గార్డెన్స్ సొంత ఖర్చులతో చూడొచ్చు. రాత్రికి శ్రీనగర్‌లోనే బస చేయాలి.

  Day 2: రెండో రోజు ఉదయం శ్రీనగర్ నుంచి సోన్‌మార్గ్ బయల్దేరాలి. అక్కడ మంచు కొండల్లో విహరించొచ్చు. థజ్వాస్ గ్లేసియర్ వరకు పోనీల సాయంతో వెళ్లొచ్చు. వేసవిలో థజ్వాస్ గ్లేసియర్ పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. సాయంత్రం శ్రీనగర్‌కు తిరిగి చేరుకోవాలి. రాత్రికి శ్రీనగర్‌లో బస చేయాలి.

  IRCTC Tirupati Tour: తిరుమల భక్తులకు శుభవార్త... శ్రీవారి దర్శనంతో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

  IRCTC Goa Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో గోవాకు హనీమూన్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

  Day 3: మూడో రోజు ఉదయం శ్రీనగర్ నుంచి పహల్గమ్ బయల్దేరాలి. కుంకుమ పొలాలు, అవంతిపూర్ శిధిలాలు చూడొచ్చు. అక్కడి ప్రకృతిని ఆస్వాదించొచ్చు. బేతాబ్ వ్యాలీ, చందన్‌వారీ, అరు వ్యాలీ కూడా చూడొచ్చు. సాయంత్రం తిరిగి శ్రీనగర్ చేరుకోవాలి. రాత్రికి శ్రీనగర్‌లోనే బస చేయాలి.

  Day 4: నాలుగో రోజు ఉదయం గుల్మార్ బయల్దేరాలి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కేబుల్ కార్ గుల్మార్గ్ గండోలా చూడొచ్చు. ఆ తర్వాత ఖిలాన్‌మార్గ్ తీసుకెళ్తారు. అక్కడ ప్రకృతి అందాలు వీక్షించిన తర్వాత తిరిగి శ్రీనగర్ వెళ్లాలి. రాత్రికి శ్రీనగర్‌లోనే బస చేయాలి.

  IRCTC: ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ వల్లభ్‌బాయి పటేల్ విగ్రహం చూస్తారా? హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

  IRCTC Tour: పూరీ, కోణార్క్ వెళ్తారా? ఐదు రోజుల టూర్ ప్యాకేజీ రూ.5,250 మాత్రమే

  Day 5: ఐదో రోజు ఉదయం శంకరాచార్య ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత మొఘల్ గార్డెన్స్, నిశాంత్ బాఘ్, చీష్‌మషాహి, షాలిమార్ గార్డెన్స్ చూడొచ్చు. తులీప్ గార్డెన్స్‌లో విహరించొచ్చు. ఆ తర్వాత బజ్రత్‌బల్ ప్రార్థాన మందిరాన్ని చూడొచ్చు. సాయంత్రం షాపింగ్ కోసం సమయం ఉంటుంది. ఆ తర్వాత హౌజ్ బోట్‌లో బస చేయాలి.

  Day 6: ఆరో రోజు ఉదయం శ్రీనగర్ నుంచి ఢిల్లీ బయల్దేరాలి. మధ్యాహ్నం 12.20 గంటలకు శ్రీనగర్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 1.50 గంటలకు ఢిల్లీ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Best tourist places, IRCTC, IRCTC Tourism, Kashmir, Tourism

  ఉత్తమ కథలు